Sam curran- Digvesh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య సోమవారం మ్యాచ్ జరగగా…. అందులో పంత్ సేన దారుణంగా ఓడిపోయింది. ఈ దెబ్బకు పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న లక్నో జట్టు ఇంటి దారి పట్టింది. అయితే హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో… చాలా అరుదైన సంఘటనలు జరిగాయి. ఎవరు ఊహించని విధంగా… అభిషేక్ శర్మ వర్సెస్ దిగ్వేశ్ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది…
Also Read: Preity Zinta: శ్రేయస్ ను కాదని వైభవ్ కు ప్రీతీ జింటా హాగ్.. 14 ఏళ్ళ కుర్రాడితో ఏంటి అరాచకం ?
అభిషేక్ శర్మ వర్సెస్ దిగ్వేష్ గొడవ
లక్నో వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ 59 పరుగులతో రెచ్చిపోయాడు. అయితే ఆ సమయంలో రంగంలోకి దిగిన లక్నో బౌలర్ దిగ్వేష్… అభిషేక్ శర్మ వికెట్ తీయడం జరిగింది. 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మను పెవిలియన్ కు పంపించాడు దిగ్వేష్. అయితే పెవిలియన్ కు వెళ్తున్న అభిషేక్ శర్మాన్ కావాలనే దిగ్విష్ గెలికాడు. సిగ్నేచర్ మూమెంట్ ఇవ్వడమే కాకుండా.. గ్రౌండ్ నుంచి వెళ్ళిపో అనే సైగలు చేశాడు.
ఇక దిగ్వేష్ చేసిన ఓవరాక్షన్ కు.. అభిషేక్ శర్మ వెంటనే రియాక్ట్ కావడం జరిగింది. గ్రౌండ్ నుంచి వెళ్ళిపోకుండా దిగ్వేష్ పైకి వచ్చాడు. ఏంట్రా నన్ను అంటావా..? నీ లెక్క ఎంత నువ్వెంత ? అటు ఎదురు దాడి చేశాడు అభిషేక్ శర్మ. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరినీ ఆపడంతో.. గొడవ చల్లారింది. అయితే ఈ సంఘటన చూసిన హైదరాబాద్ అభిమానులు… సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. అభిషేక్ శర్మ లాంటి తోపు ఆటగాన్ని… గెలికిన దిగ్వేష్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు.
దిగ్వేష్ ను టార్గెట్ చేసిన సామ్ కరణ్
అభిషేక్ శర్మ వర్సెస్ దిగ్వేష్ మధ్య జరిగిన సంఘటనలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సామ్ కరణ్ రంగంలోకి దిగాడు. ఈ గొడవలోకి సామ్ కరణ్ ఎందుకు వచ్చాడని అందరూ అనుకుంటారు. కానీ అతడు నేరుగా రాలేదు. అచ్చం అతనిలాగే.. హైదరాబాద్ అభిమానులలో ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అచ్చం సామ్ కరణ్ ను తమ్ముడు లాగే కనిపించాడు. అతని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అభిషేక్ శర్మ అలాగే దిగ్వేశ్ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత.. హైదరాబాద్ ఆటగాడు కమింద్ రెచ్చిపోయాడు. దిగ్వేష్ బౌలింగ్లో వరుసగా మూడు బౌండరీలు కొట్టాడు కమిందు. ఈ నేపథ్యంలోనే… సామ్ కరణ్ తరహాలో ఉన్న ఓ వ్యక్తి… జనాల్లో ఉండి.. దిగ్వేష్ ను ట్రోలింగ్ చేశాడు. అచ్చం అతని లాగా సిగ్నేచర్ మూమెంట్ ఇస్తూ… రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఇది టీవీ స్క్రీన్ పైన కనిపించడంతో… లక్నో కెప్టెన్ పంత్ కూడా నేలకు ముఖం వేశాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: BCCI on PCB: పాకిస్థాన్ కు షాక్.. BCCI అదిరిపోయే స్కెచ్.. ఇక ఆసియా కప్ జరిగే ఛాన్స్ లేదుగా !
What is sam curren doing in lucknow pic.twitter.com/y4tLKYAPSR
— Mr.Ace (@Predator_9876) May 19, 2025