BigTV English

OTT Movie : ఎలుకలో దయ్యం… వామ్మో ఈ టార్చర్ కి నరకం… ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : ఎలుకలో దయ్యం… వామ్మో ఈ టార్చర్ కి నరకం… ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : మూవీ లవర్స్ కి హారర్ సినిమాలు మంచి కిక్ ఇస్తుంటాయి. థియేటర్లకంటే ఈ సినిమాలను ఓటీటీలో చూడటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఓక రైతు చుట్టూ తిరుగుతుంది. తన భార్య ఆత్మగా వచ్చి, అతన్ని బాగా వేధిస్తుంది. ఆ తరువాత ఊహించని పరిణామాలు ఎదురౌతాయి. వెన్నులో వణుకు పుట్టించే ఈ హారర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

విల్ఫ్ 80 ఎకరాల భూమిని కలిగి ఒక రైతు. అతని భార్య ఆర్లెట్‌కు తన తండ్రి నుండి 100 ఎకరాల భూమి వారసత్వంగా వస్తుంది. ఆర్లెట్ ఆ భూమిని అమ్మి, సిటీకి వెళ్లాలని అనుకుంటుంది. కానీ విల్ఫ్ ఇందుకు వ్యతిరేకంగా ఉంటాడు. అతను రైతు జీవితాన్ని కొనసాగించాలని, భూమిని కాపాడాలని కోరుకుంటాడు. ఈ విషయంలో వారి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తుతాయి. విల్ఫ్ తన కొడుకు హెన్రీని ఒప్పించి, ఆర్లెట్‌ను హత్య చేయాలని కుట్ర పన్నుతాడు. విల్ఫ్, ఆర్లెట్‌ కు మద్యం తాగించి, హెన్రీ సహాయంతో ఆమె గొంతు కోసి హత్య చేస్తాడు. వారు ఆమె శవాన్ని ఒక బావిలో పడవేసి, దాన్ని దాచడానికి ఒక ఆవును కూడా బావిలో తోసేస్తారు. అయితే, ఈ హత్య తర్వాత విల్ఫ్. హెన్రీలను అపరాధ భావం వెంటాడుతుంది. హెన్రీ మానసికంగా కృంగిపోతాడు. హెన్రీ తన ప్రియురాలితో అక్కడినుంచి బయటికి వెళ్ళిపోతాడు.


ఈ సమయంలో హెన్రీ  ప్రియురాలు షానన్ గర్భవతి అవుతుంది.హెన్రీ ఆమెతో కలసి బతకడానికి దొంగతనాలు కూడా చేస్తాడు. చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. చివరికి ఒక దోపిడీలో వీళ్లిద్దరూ చనిపోతారు. మరోవైపు విల్ఫ్‌ను ఎలుకలు వెంటాడుతాయి. ఇవి ఆర్లెట్ శవాన్ని తిన్న ఎలుకలు. అతను ఊహించని సంఘటనలను ఎదుర్కొంటాడు. ఆర్లెట్ ఆత్మ అతన్ని వేధిస్తుందని నమ్ముతాడు. చివరికి ఆర్లెట్ ఆత్మ విల్ఫ్ ను ఏం చేస్తుంది ? ఎలుకల వల్ల విల్ఫ్ కు ఎటువంటి సమస్యలు వస్తాయి ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఒక్క మర్డర్ ఎన్నో అనుమానాలు, థ్రిల్లింగ్ ట్విస్టులు… క్రిప్టో కరెన్సీతో కిక్కెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

 

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు’1922′ స్టీఫెన్ కింగ్ రాసిన నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. దీనికి జాక్ హిల్డిచ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్టోరీ 1922లో నెబ్రాస్కాలోని హెమింగ్‌ ఫోర్డ్‌లో జరుగుతుంది. ఇందులో థామస్ జేన్, నీల్ మెక్‌డొనాఫ్, మోలీ పార్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఓటీటీ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×