BigTV English

OTT Movie : దయ్యాల కొంపలో దడుచుకునే ఆటలు… ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ థ్రిల్లర్

OTT Movie : దయ్యాల కొంపలో దడుచుకునే ఆటలు… ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ థ్రిల్లర్

OTT Movie : వెన్నులో వణుకు పుట్టించే హారర్ సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి?  ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ హారర్ మూవీని చూస్తే నైట్ నిద్ర పట్టడం కష్టమే. సింగిల్ గా చూశారంటే గుండె జారిపోవడం ఖాయం. ఇంతటి భయంకరమైన సీన్స్ ఉన్న ఈ హారర్ మూవీ పేరేంటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రూమ్ 203’ (Room 203). 2022 లో వచ్చిన ఈ మూవీ నానామి కమోన్ రాసిన జపనీస్ నవల ఆధారంగా రూపొందింది. ఇందులో ఫ్రాన్సిస్కా జురెబ్, విక్టోరియా విన్యార్స్కా నటించారు. ఈ మూవీ 2022 ఏప్రిల్ 15న విడుదలైంది. ఈ సినిమా కథ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. వీరిద్దరూ కలిసి ఒక కొత్త అపార్ట్‌మెంట్‌ లో, రూమ్ నెంబర్ 203లోకి మారతారు. అక్కడ మనుషులను హింసించి చంపే ఆత్మలతో పోరాడాల్సి వస్తుంది. ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

కిమ్ జర్నలిజం చదవడానికి కాలేజీలో చేరుతుంది. ఆమె ఇజ్జీ అనే అమ్మాయితో కలసి ఒక అపార్ట్‌మెంట్‌లో రూమ్ నెం. 203 లో ఉంటుంది. తల్లి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇజ్జీ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. కిమ్ తల్లిదండ్రులు ఇజ్జీ ప్రవర్తన నచ్చకపోవడంతో ఆమెతో కలిసి ఉండకూడదని హెచ్చరిస్తారు. కానీ కిమ్ తిరిగి ఇజ్జీతో రూమ్ 203లో ఉండాలని డిసైడ్ అవుతుంది. అపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళాక వింత సంఘటనలు మొదలవుతాయి. గోడలోని రంధ్రం నుండి శబ్దాలు, నీడలు కనిపించడం, ఇజ్జీ స్లీప్‌ వాకింగ్ కిమ్ ను కలవరపెడతాయి. కిమ్ తన బాయ్‌ ఫ్రెండ్ ఇయాన్ సహాయంతో అపార్ట్‌మెంట్ చీకటి చరిత్రను ఆరా తీయడం మొదలు పెడుతుంది. స్టెయిన్డ్ గ్లాస్ విండోలో ఎవరో ఉన్నట్లు, కిమ్ కు అనిపిస్తూ ఉంటుంది. ఈ అపార్ట్‌మెంట్‌లో గతంలో నివసించిన వారంతా అదృశ్యమయ్యారని, అందులో ఒక భయంకరమైన శాపం ఉన్నట్లు తెలుస్తుంది.

50 సంవత్సరాల క్రితం లియామ్, కరెన్ అనే జంట ఈ అపార్ట్‌మెంట్‌లో చనిపోయారని, ఆ సమయంలో కరెన్ గర్భవతిగా ఉందని తెలుస్తుంది. చనిపోయి తరువాత వాళ్ళు అక్కడ ఆత్మలు గా ఉన్నారని కనిపెడుతుంది. ఇక ఇప్పుడు ఇజ్జీ ప్రవర్తన కూడా విపరీతంగా మారుతుంది. కిమ్ తన స్నేహితురాలిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. ఇజ్జీ ధరించిన నెక్లెస్‌ కు ఒక శాపం ఉంటుందని కిమ్ తెలుసుకుంటుంది. ఇప్పుడు కిమ్ దాన్ని తొలగించి, స్టెయిన్డ్ గ్లాస్ విండోను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో దెయ్యం వీరిని చంపడానికి ట్రై చేస్తుంది. కిమ్ ఆ దెయ్యం దాడిలో తీవ్రంగా గాయపడుతుంది. వారు అపార్ట్‌మెంట్ నుండి తప్పించుకుని కిమ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. చివరికి కిమ్, ఇజ్జీ ప్రాణాలతో బయటపడతారా ? రూమ్ నెం. 203లో ఉన్న అసలు రహస్యం ఏమిటి ? ఇజ్జీ ధరించిన నెక్లెస్‌ కు ఉన్న శాపం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : పిసినారితనంతో పిచ్చెక్కించే మిడిల్ క్లాస్ మూవీ … ఈ కామెడీకి పొట్ట చెక్కలే

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×