BigTV English

Samson brothers: తమ్ముడి కెప్టెన్సీలో ఆడుతున్న టీమిండియా ప్లేయర్

Samson brothers: తమ్ముడి కెప్టెన్సీలో ఆడుతున్న టీమిండియా ప్లేయర్

Samson brothers: టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ {Sanju Samson} తన బ్యాటింగ్ తో మాత్రమే కాకుండా తన అద్భుతమైన ఫీల్డింగ్ తో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఐపీఎల్ నుండి అంతర్జాతీయ క్రికెట్ వరకు అతడు ఎంతో చురుకుగా వ్యవహరిస్తూ ఎన్నోసార్లు మ్యాచ్ గమనాన్ని మార్చాడు. ఇప్పుడు అతని నైపుణ్యం కేరళ క్రికెట్ లీగ్ లో కూడా కనిపించింది. అక్కడ సంజూ తన సోదరుడు సాలి శాంసన్ తో కలిసి జట్టుకు గొప్ప విజయాన్ని అందించారు.


Also Read: Hardik Pandya: టాలీవుడ్ హీరోయిన్ తో హార్దిక్ పాండ్య పెళ్ళి.. ఇదిగో వీడియో

ఆగస్టు 21 గురువారం రోజు కేరళ క్రికెట్ 2 సీజన్ లో కొచ్చి బ్లూ టైగర్స్ – అదానీ త్రివేండ్రం రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సంజూ తన జట్టుకు తన సోదరుడు సాలి శాంసన్ తో కలిసి మొదటి వికెట్ తీసుకున్నాడు సంజూ. ఈ మ్యాచ్ లో తొలి బంతికే ఓపెనర్ సుబిన్ ఎస్ బంతిని ఆఫ్ సైడ్ వైపు ఆడాడు. అనంతరం సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఈ సమయంలో సంజు బౌలర్ ఎండ్ కి డైరెక్ట్ గా త్రో విసిరాడు. ఆ బంతిని అతడి సోదరుడు, జట్టు కెప్టెన్ సాలి శాంసన్ అందుకొని రన్ అవుట్ చేశాడు. దీంతో అన్నదమ్ములు కలిసి చేసిన ఈ రన్ అవుట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈ వికెట్ ని ఈ సీజన్ కి చిరస్మరణీయమైన ప్రారంభంగా జరుపుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్ లో త్రివేండ్రం రాయల్స్ కేవలం 97 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. అయితే ఈ కేరళ క్రికెట్ లీగ్ రెండవ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో సంజూ శాంసన్ రికార్డ్ ధర పలికిన విషయం తెలిసిందే. కేరళ క్రికెట్ లీగ్ రెండవ సీజన్ కి ముందు జరిగిన వేలంలో ఒక్కో ఫ్రాంచైజీ కి 50 లక్షల పర్స్ గా కేటాయించారు. ఆ డబ్బుతోనే ఫ్రాంచైజీలు జట్టును సెట్ చేసుకోవాల్సి ఉండగా.. ఈ అడిషన్ ద్వారా తొలిసారి వేలంలోకి వచ్చిన సంజు కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.

మూడు లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన ఇతడిని.. కొచ్చి బ్లూ టైగర్స్ 26.80 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు ఆ జట్టును విజయాల బాట పట్టిస్తున్నాడు సంజూ. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ లో సంజూ రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇతడిని ట్రేడింగ్ ద్వారా దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ పోటీ పడుతున్నట్లు సమాచారం.

Also Read: Rinku Singh: ఆసియా కప్ కంటే ముందు పాకిస్తాన్ కు డేంజర్ బెల్స్ పంపించిన రింకు సింగ్.. సెంచరీ చేసి మరి

కానీ సంజు విషయంలో రాజస్థాన్ రాయల్స్ డిమాండ్లకు ఆ ఫ్రాంచైజీలు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. క్యాష్ డీల్ వరకు ఓకే కానీ.. తమ ఆటగాళ్లను వదులుకునే ప్రసక్తే లేదని సదరు ఫ్రాంచైజీలు చెప్పినట్లు సమాచారం. ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ కోరుకున్నట్లయితే ప్రతిగా నగదుతో పాటు ఇద్దరు ఆటగాళ్లను రాజస్థాన్ రాయల్స్ డిమాండ్ చేసిందట. ఈ విషయంలో రాజస్థాన్ రాయల్స్ డిమాండ్లను రెండు ఫ్రాంచైజీలు తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Related News

Sachin Tendulkar : నిజంగా సచిన్ దేవుడే.. తన అభిమాని కోసం నడిరోడ్డు పైనే కారు ఆపి

Hardik Pandya: టాలీవుడ్ హీరోయిన్ తో హార్దిక్ పాండ్య పెళ్ళి.. ఇదిగో వీడియో

Rinku Singh: ఆసియా కప్ కంటే ముందు పాకిస్తాన్ కు డేంజర్ బెల్స్ పంపించిన రింకు సింగ్.. సెంచరీ చేసి మరి

Undertaker coming Bigg Boss 19 : బిగ్ బాస్ లోకి మల్లయోధుడు అండర్ టేకర్… ఎప్పుడంటే.

Mohammed Siraj : టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ రిటైర్మెంట్..?

Big Stories

×