Chiranjeevi Mega 157 Movie Title: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాల అప్‌డేట్స్ అభిమానులకు ట్రీట్ ఫీస్ట్ ఇస్తున్నాయి. ఆగష్టు 22 చిరంజీవి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియాలో శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఆయన చిత్రాలకు సంబంధించి వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఆయన బర్త్‌డే సందర్భంగా నిన్న (ఆగష్టు 21) విశ్వంభర గ్లింప్స్ వదిలారు. తాజాగా అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబో తెరకెక్కుతోన్న మెగా157 మూవీ నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో చిరు లుక్ కేక పెట్టించేలా ఉంది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
శివ శంకర ప్రసాద్
చిరు 157వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్ లైన్. ఇందులో చిరు వింటేజ్ లుక్‌లో కనిపించారు. షూటు, బూటు, టై, ధరించి చేతిలో తుపాకితో ఎంట్రీ ఇచ్చారు. ఇందులో బాస్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. వింటేజ్ చిరుని చూస్తున్నట్టు ఉందంటున్నారు. మొత్తానికి బాస్ బర్త్‌డే ట్రీట్ అదిరిపోయిందంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడికి మెగా ఫ్యాన్స్ అంతా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మరో స్టార్ హీరో నటిస్తున్నట్టు ముందు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనే మన వెంకీమామ విక్టరీ వెంకటేష్. ఇందులో వెంకీమామ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు గట్టి ప్రచారం జరుగుతుంది.
కానీ ఇప్పటి వరకు దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన లేదు. తాజాగా గ్లింప్స్‌లో వెంకీమామ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు’ అంటూ వెంకీమామ వాయిస్ ఇచ్చారు. ఇది గ్లింప్స్‌కి మరింత హైలెట్ అయ్యింది. అయితే గ్లింప్స్‌లో ఆయన వాయిస్ వినిపంచడం వెంకీమామ తెరవెనుక ఉంటారా? అనే సందేహాలు వచ్చాయి. కానీ, త్వరలోనే ఆయన సెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆఫిషియల్‌గా చెప్పేశారు. గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడారు.
Also Read: Anushka Shetty: అనుష్క మార్కెట్ రూ. 25 కోట్లలోపే… యంగ్ హీరోయిన్ బెటర్ కదా..
త్వరలోనే వెంకటేష్ గారి ఎంట్రీ
ఆయన మాట్లాడుతూ.. “వెంకటేష్ గారు అడగ్గానే హ్యాపీ వచ్చి గ్లింప్స్‌కి వాయిస్ ఇచ్చారు. ఇందుకు ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నారు. ప్రస్తుతానికి వాయిస్ మాత్రమే ఇచ్చారు. త్వరలోనే ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు” అని వెంకీమామ ఎంట్రీని ఆఫీషియల్ చేశారు. ఇది విని అభిమానులంత సంబరాలు చేసుకుంటున్నారు. తెరపై బాస్ డ్యాన్స్,గ్రేస్,కామెడీ అంటేనే పడి చస్తారు. అలాంటిది ఇక ఇందులో వెంకీమామ భాగమైతే.. ఇక వెండితెరపై వీరిద్దరి సీన్స్ నెక్ట్స్ లెవెలే అంటున్నారు. సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ అంచనాలు వేసుకుంటున్నారు. అనిల్ రావిపూడి సినిమాలంటేనే కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి కేరాఫ్. అలాంటి ఆయన చిరంజీవి, వెంకిటేష్‌లతో మన శంకర వరప్రసాద్ మూవీని గట్టిగానే ప్లాన్ చేశారని, ఈసారి పండకి సందడి మామూలుగా ఉండదంటున్నారు.