BigTV English

Sanju Samson : సంజు శాంసన్ విధ్వసం.. సెంచరీతో గిల్ కు స్ట్రాంగ్ వార్నింగ్..!

Sanju Samson : సంజు శాంసన్ విధ్వసం.. సెంచరీతో గిల్ కు స్ట్రాంగ్ వార్నింగ్..!

 Sanju Samson :  టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ (Sanju Samson)  విధ్వంసం సృష్టించాడు. కేరళ క్రికెట్ లీగ్ లో కొచ్చి బ్లూ టైగర్స్ ( Kochi Blue Tigers) ప్లేయర్ సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కొల్లం సెయిలర్స్ (Kollam Sailors) తో జరిగిన మ్యాచ్ లో కేవలం 42 బంతుల్లోనే సెంచరీ సాధించాడు సంజూ శాంసన్. తొలుత బ్యాటింగ్ చేసిన కొల్లం 20 ఓవర్లలో 236/5 రన్స్ చేసింది. ఛేదనలో శాంసన్ 51 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 121 పరుగులు చేశారు. చివర్లో సంజూ శాంసన్ ఔట్ అయినప్పటికీ ఆషిక్ 18 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ముఖ్యంగా చివరి బంతికి సిక్సర్ కొట్టి అనూహ్య విజయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2025 టోర్నీ సెప్టెంబర్ 09వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.


Also Read : Sara Tendulkar : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కూతురు సారా ?

టీ-20 ఫార్మాట్ లో ఈ టోర్నీ జరుగనుంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. అయితే భారత జట్టును ప్రకటించిన తరువాత ఆసియా కప్ లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంటుందనే అంశం పై రకరకాల చరర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఓపెనర్లుగా ఎవ్వరూ క్రీజులోకి లైనఫ్ ఎలా ఉంటుందనే అంశం పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఓపెనర్లుగా క్రీజులోకి ఎవ్వరూ క్రీజులోకి వస్తారనే అంశం పై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. శుబ్ మన్ గిల్, సంజు శాంసన్ కి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో సెంచరీలో చేలరేగిపోయిన సంజు శాంసన్ శుబ్ మన్ గిల్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని చెప్పవచ్చు.


సంజూ శాంసన్ విధ్వంసం.. 

సంజు శాంసన్ కేరళ క్రికెట్ లీగ్ -2025లో కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఆదివారం ఏరీస్ కొల్లం సెయిలర్స్ తో జరిగిన మ్యాచ్ లో కొచ్చి బ్లూ టైగర్స్ తరపున బరిలోకి దిగిన సంజూ.. బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన అతను మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తద్వారా కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. సంజూ శాంసన్ తన ఇన్నింగ్స్‌లో తొలి 16 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. ఆ తరువాత 26బంతుల్లోనే మరో ఆఫ్ సెంచరీ చేశాడు. దీంతో 42 బంతుల్లోనే 13ఫోర్లు, ఐదు భారీ సిక్సులతో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం తన ఇన్నింగ్స్‌లో 51 బంతులను ఎదుర్కొన్న సంజూ.. 121 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో సెలక్టర్ల దృష్టిని మరోసారి సంజూ శాంసన్ తనవైపు తిప్పుకున్నాడు. తద్వారా ఆసియా కప్ లో ఓపెనింగ్ స్థానం నాదే అంటూ గిల్ కు వార్నింగ్ ఇచ్చాడు.

చివరి బంతికి విజయం

ఆసియా కప్ టోర్నీలో వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గిల్ ఎంట్రీతో సంజూ శాంసన్ ఓపెనింగ్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఆయన్ను మిడిలార్డర్‌కు పరిమితం చేయొచ్చునని లేదా పూర్తిగా పక్కన పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు క్రీజులోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో కేరళ క్రికెట్ లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన సంజూ.. తుపాను ఇన్నింగ్స్‌తో కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడం విశేషం. చివర్లో సంజూ శాంసన్ ఔట్ అయినప్పటికీ ఆషిక్ 18 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఆషిక్ చివరి బంతికి సిక్సర్ కొట్టి అనూహ్య విజయాన్ని అందించారు.

Related News

Cricketers : క్రికెటర్లు చేతి వేళ్లకు టేప్ ఎందుకు వేసుకుంటారు.. దీని వెనుక రహస్యం ఏంటి

Head – Abhishek : అభిషేక్ ఒకలా.. హెడ్ మరోలా.. SRH కు ఎక్కడ దొరికార్రా మీరు..

Harshit Rana : గంభీర్ ఎంతకు తెగించాడు రా.. ఏకంగా హర్షిత్ రాణాకు వైస్ కెప్టెన్సీ?

Vimal Pan Masala : టీమిండియా స్పాన్సర్ గా గుట్కా కంపెనీ.. ఆసియా కప్ కంటే ముందు కీలక పరిణామం!

Watch Video: సిక్స్ కొట్టి గుండెపోటుతో చనిపోయిన క్రికెటర్.. వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే

Ajinkya Rahane : కోహ్లీ, రోహిత్, పూజారా, అశ్విన్ రిటైర్మెంట్.. అజింక్య రహానేపై ట్రోలింగ్

Big Stories

×