Sarfaraz Khan : టీమిండియా క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను చూడటానికి చాలా లావుగా.. బొద్దుగా కనిపిస్తుంటాడు. అయితే ఇతను టెస్ట్ ల్లో ఆరంగేట్ర మ్యాచ్ లోనే అదరగొట్టాడు. ఇంగ్లండ్ స్పిన్ బౌలర్ల ను అలవొకగా ఎదుర్కొని తనదైన శైలిలో పరుగులను సాధించాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కి సర్పరాజ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అందుకోసం కఠోర శ్రమ పడుతున్నాడు. మరోసారి ఇంగ్లండ్ పై తన ప్రదర్శన చూపించాలని తాపత్రాయ పడుతున్నాడు. అయితే వచ్చే నెలలోనే టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఉంది.
Also Read : Cricket bat sponsorships: క్రికెటర్ల బ్యాట్లపై స్టిక్కర్లు వేయించుకుంటే ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా ?
ఈ సిరీస్ కోసం సెలక్ట్ కావాలని సర్ఫరాజ్ కఠోరంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం లావుగా ఉన్న అతను.. ఏకంగా 10 కేజీల బరువు తగ్గాడు. నిత్యం ఫ్రాక్టీస్ చేయడం..డైట్ ఫాలో కావడం చేస్తున్నాడు. ఎలాగైనా ఇంగ్లండ్ సిరీస్ కి ఎంపికై తాను ఏంటో నిరూపించుకోవాలని కష్టపడుతున్నాడు సర్ఫరాజ్ ఖాన్. సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తరఫున ఇంగ్లండ్ పై అరంగేట్రం చేసిన ఈ ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్.. ప్రారంభ మ్యాచులోనే అదరగొట్టేశాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటూ.. దూకుడైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజ్‌కోట్ టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లోనూ హాఫ్ సెంచరీలు (తొలి ఇన్నింగ్సులో 66 బంతుల్లో 62 రన్స్, రెండో ఇన్నింగ్సులో 72 బంతుల్లో 68* రన్స్) సాధించాడు. దీంతో ఇంగ్లండ్ పై అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడని అందరి దృష్టిని ఆకర్షించాడు.
Also Read : Shahid Afridi : ఇండియాపై వార్.. పాక్ ఓటమికి కారణమైన ఆఫ్రిదికి అవార్డు
మరోవైపు గత ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో తొలి ఇన్నింగ్స్ లో జీరో.. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. 110 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒక టెస్ట్ మ్యాచ్ లో సున్నాతో సెంచరీ చేసిన ప్రత్యేక సాధకుల జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ చేరాడు. దీంతో 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం 183 మంది ఆటగాళ్లు మాత్రమే సున్నాతో పాటు సెంచరీ చేసిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ జీరో సెంచరీ రికార్డు జాబితాల సర్ఫరాజ్ ఖాన్ 183వ బ్యాట్ మెన్. గతంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత బ్యాటర్ శుభ్ మన్ గిల్ డకౌట్ అయి.. సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అలాగే మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 2014లో ఆక్లాండ్ లోని ఈడెన్ పార్కులో న్యూజిలాండ్ పై మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్ అయి.. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ బాదాడు. అలా సర్ఫరాజ్ ఖాన్ కూడా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం సర్పరాజ్ ఖాన్ కఠోర శ్రమ చూసి పలువురు అభిమానులు ఈ క్రికెటర్ ని కచ్చితంగా టెస్ట్ సిరీస్ కి సెలెక్ట్ చేయాలని కోరుకుంటున్నారు.