BigTV English
Advertisement

Cricket bat sponsorships: క్రికెటర్ల బ్యాట్లపై స్టిక్కర్లు వేయించుకుంటే ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా ?

Cricket bat sponsorships: క్రికెటర్ల బ్యాట్లపై స్టిక్కర్లు వేయించుకుంటే ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా ?

Cricket bat sponsorships : సాధారణంగా క్రికెటర్లు వివిధ  బ్రాండ్స్ కి చెందిన స్టిక్కర్లను వాళ్ల బ్యాట్ పై వేయించుకుంటుంటారు. అయితే వాటికి ఎంత ఛార్జీ తీసుకుంటారో చాలా మందికి తెలియదు. మరికొందరూ అయితే స్టిక్కర్లు వేయించుకుంటే డబ్బులు కూడా తీసుకుంటారా..? అని కూడా ఆశ్చర్యపోతుంటారు. మంచి ఫామ్ లో ఉన్న క్రికెటర్లు అధిక ధర తీసుకుంటారు. ఎవరెవరూ ఎంతెంత తీసుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read :  Ms Dhoni: ధోనికి ఘోర అవమానం.. “దేశ ద్రోహి” అంటూ పోస్టులు !

ఎం.ఎస్. ధోనీ : 


టీమిండియా మాజీ క్రికెటర్ ఎం.ఎస్.ధోనీ కి SPARTAN కంపెనీ ధోనికి రూ.2.2 కోట్లు సంవత్సరానికి ఇవ్వనుంది. అయితే ఎం.ఎస్.ధోనీ ప్రస్తుతం టీమిండియా కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ధోనీ అన్ని ఫార్మాట్లలో తనదైన శైలిలో ఆడాడు. కెప్టెన్ గా ఉన్న సమయంలో అన్నింటిలో టైటిల్స్ అందించాడు.

స్టీవ్ స్మిత్ : 

స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా క్రికెటర్. ఇతనికి కూడా భారీగానే స్టిక్కర్లకు వస్తున్నాయి. న్యూ బాలెన్స్ కంపెనీ 2.45 కోట్లు సంవత్సరానికి చెల్లిస్తుంది.

డేవిడ్ వార్నర్ : 

ఆస్ట్రేలియాకి చెందిన మరో క్రికెటర్ డేవిడ్ వార్నర్. గతంలో ఇతను సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడాడు. ఒకసారి హైదరాబాద్ కి టైటిల్ కూడా అందించాడు. కానీ ఈ సీజన్ లో ఐపీఎల్ లో ఆడటం లేదు వార్నర్. కానీ పీఎస్ఎల్ లో ఆడుతున్నాడు.  అయితే వార్నర్ కి DSC కంపెనీ 3.35 సంవత్సరానికి స్టిక్కర్లు వేసినందుకు చెల్లిస్తుంది.

రోహిత్ శర్మ : 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇతను ఇటీవలే టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ అయ్యాడు. ఇతని పేరిట ముంబై లోని వాంఖడే స్టేడియానికి ఓ స్టాండ్ కూడా ఏర్పాటు చేశారు. రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఇతని కెప్టెన్సీలో ముంబై కి 5 టైటిల్స్ అందించాడు. రోహిత్ శర్మ కి CEAT కంపెనీ స్టిక్కర్స్ వేసినందుకు సంవత్సరానికి 4 కోట్లు చెల్లిస్తుంది. టీమిండియా క్రికెటర్లలో విరాట్ కోహ్లీ తరువాత అత్యధికంగా తీసుకునే బ్యాటర్ రోహిత్ శర్మ నే కావడం విశేషం.

విరాట్ కోహ్లీ : 

టీమిండియా కీలక బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ. ఇతను గ్రౌండ్ లోకి అడుగుపెడితే చాలు అభిమానులు కేరింతలు మామూలుగా ఉండదు. సచిన్ టెండూల్కర్ తరువాత రికార్డులను క్రియేట్ చేసిన బ్యాటర్లు ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ అనే చెప్పవచ్చు. విరాట్ కోహ్లీ టెస్ట్ ల్లో, టీ-20ల్లో, వన్డేల్లో అన్నింటిలో రికార్డులు నెలకొల్పాడు. ఇటీవలే టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అలాగే టీ-20 వరల్డ్ కప్ వచ్చిన తరువాత టీమిండియా తరపున టీ-20 ఫార్మాట్ క్రికెట్ కి కూడా గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం కేవలం వన్డేలు మాత్రమే ఆడనున్నాడు విరాట్ కోహ్లీ. అయితే కోహ్లీ ఎం.ఆర్.ఎఫ్ బ్యాట్ ను ఉపయోగిస్తుంటాడు. ఎం.ఆర్.ఎఫ్ బ్యాట్ ఉపయోగించాలని కంపెనీ 100 కోట్లు డీల్ కుదిరించుకుంది. అంతేకాకుండా కోహ్లీ బ్యాట్ కి స్టిక్కర్ వేసినందుకు సంవత్సరానికి 12 కోట్లు అదనపు చెల్లించనుంది.

?igsh=ZXFyMHc2aHBqYThu

Related News

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Gambhir-Shubman Gill: గిల్‌కు క్లాస్ పీకిన కోచ్ గంభీర్..నీకు సోకులు ఎక్కువ, మ్యాట‌ర్ త‌క్కువే అంటూ !

PM MODI: వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ ట‌చ్ చేయ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్..ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏం చేశారంటే ?

IND VS AUS, 4th T20: నేడే 4వ టీ20..టీమిండియాకు అగ్ని ప‌రీక్షే..గిల్ వేటు, రంగంలోకి డేంజ‌ర్ ప్లేయ‌ర్ !

RCB ON SALE: అమ్ముడుపోయిన RCB, WPL జ‌ట్లు.. మార్చి నుంచే కొత్త ఓన‌ర్ చేతిలో !

Indian Womens Team: ప్ర‌ధాని మోడీకి వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ల స్పెష‌ల్ గిఫ్ట్‌..”న‌మో” అంటూ

Big Stories

×