Big Stories

2024 Bajaj Pulsar NS400 : స్పోర్టీ లుక్‌తో పల్సర్ NS400.. మే 3న లాంచ్!

2024 Bajaj Pulsar NS400 : బైక్స్‌లో బజాజ్ పల్సర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంపెనీ పల్సర్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి అనేక అప్‌డేట్‌లను తీసుకొస్తుంది. అయితే తాజాగా కంపెనీ కొత్త పల్సర్‌ను NS400 లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ బజాజ్ పల్సర్ ఇండియన్ మార్కెట్లోకి రాకముందే కొత్త టీజర్‌‌ను విడుదల చేసింది. దీని ఆధారంగా పల్సర్ స్పోర్టియర్ లైనప్‌లో తీసుకురానుంది. మే 3న పల్సర్‌ NS400 ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

2024 బజాజ్ పల్సర్ NS400 లేటెస్ట్ టీజర్ డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్టీ ఫీచర్‌తో బైక్ వస్తుందని సూచిస్తుంది. అయినప్పటికీ ఇది ABS మోడ్‌లను కూడా కలిగి ఉంటుంది. అందులో రెయిన్, రైడ్, ఆఫ్/ఆన్ మోడ్‌లు ఉన్నాయి. ABS గురించి మాట్లాడితే బ్రేకింగ్ కోసం ఇందులో డ్యూయల్ డిస్క్‌లు ఉన్నాయి.

- Advertisement -

Also Read : BMW కొత్త ఎలక్ట్రిక్ కార్ లాంచ్.. ధర ఎంతంటే?

టీజర్ నుంచి రివీల్ అయిన మరో విషయం ఏమిటంటే బైక్ ఫ్రంట్‌లో అప్-సైడ్ డౌన్ ఫోర్క్స్ ఉంది. అలానే కంపెనీ ఇటీవల కాలంలో పల్సర్ అన్ని బైకుల ముందు భాగంలో USD ఫోర్క్‌లను కలిగి ఉండేలా అప్‌డేట్ చేస్తోంది. USD ఫోర్క్‌లు బైక్‌కు మంచి కంపోజ్డ్ రైడ్‌ను అందిస్తాయి. బజాజ్ పల్సర్ NS400తో ట్రాక్షన్ కంట్రోల్‌ను కూడా ఉంటుంది.

టీజర్‌లో గమనించదగ్గ విషయం ఏమిటంటే బాడీ ప్యానెల్స్‌పై ఫాక్స్ కార్బన్ ఫినిషింగ్ ఉపయోగించారు. పల్సర్ NS400 హెడ్‌ల్యాంప్‌లు పల్సర్ NS200ని పోలి ఉంటాయి. అయితే బైక్ మరింత స్పీడ్ అందుకునేలా ఎలిమెంట్స్‌లో కొన్ని మార్పులు చేశారు.

పల్సర్ సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది.ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో నోటిఫికేషన్‌లు,కాల్ మేనేజ్‌మెంట్‌ను కూడా చూడొచ్చు. ఇందులో అదనంగా మొబైల్ ఛార్జ్ చేయడానికి USB పోర్ట్ కూడా ఉంది. ఫ్యూయల్ లెవల్, గేర్ పొజిషనింగ్ వంటి రియల్ టైమ్ అప్‌డేట్‌లను పొందవచ్చు.

Also Read:  ల్యాండ్ రోవర్ నుంచి పవర్ ఫుల్ ఎస్‌యూవీ.. జూలైలో లాంచ్!

ఇక ఇంజన్ విషయానికి వస్తే రాబోయే NS400 కోసం బజాజ్ ఏ ఇంజన్ ఉపయోగిస్తుందో సమాచారం అందుబాటులో లేదు. ఇది డొమినార్ 400కి పవర్ ఇచ్చు 373 సీసీ యూనిట్ కావచ్చు లేదా డ్యూక్ 390,399 సీసీ ఇంజన్‌‌పై రావచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News