BigTV English

WPL 2025: దరిద్రం అంటే వీళ్లదే… మూడు సార్లు ఫైనల్స్ ఓడిపోయారు !

WPL 2025: దరిద్రం అంటే వీళ్లదే… మూడు సార్లు ఫైనల్స్ ఓడిపోయారు !

WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ {డబ్ల్యూపిఎల్} 2025 విజేతగా ముంబై ఇండియన్స్ జట్టు నిలిచింది. ఈ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా మూడవసారి ఫైనల్ చేరింది. మేగ్ లానింగ్ నాయకత్వంలో మూడు సీజన్లలోనూ ఫైనల్స్ కి చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది ఢిల్లీ క్యాపిటల్స్. కానీ శనివారం ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్మన్ ప్రీత్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు విజయకేతనం ఎగురవేసింది.


Also Read: Rohit Sharma – Maldives: IPL ముందు భార్యతో రోహిత్ ఎంజాయ్‌..?

ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కి ఢిల్లీ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఇక ముంబై మాత్రం గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. ఇక మొదట బ్యాటింగ్ కి దిగిన ముంబై జట్టుకి ఆరంభంలోనే వరుస షాక్ లు తగిలాయి. ఢిల్లీ బౌలర్ మరిజేన్ కాప్ దెబ్బకు ముంబై ఓపెనర్లు యాస్తిక భాటియా {8}, హేలీ మ్యాథ్యూస్ {3} ఆదిలోనే పెవిలియన్ చేరారు.


ఆ తర్వాత కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్, నాట్ స్కివర్ బ్రాండ్ 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హర్మన్ ప్రీత్ కౌర్ 44 బంతులలో 66 పరుగులు చేసింది. ఇందులో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్స్ లతో చెలరేగింది. అలాగే నాట్ స్కివర్ కూడా 30 పరుగులు చేసింది. దీంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను నష్టానికి 149 పరుగులు చేసింది.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఆరంభం నుండి వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఈ సీజన్ ప్రారంభం నుండి భారీ టార్గెట్లను సునాయసంగా చేదించిన ఢిల్లీ.. ఫైనల్ లో మాత్రం లక్ష్య చేదనలో తడపడింది. ఢిల్లీ జట్టులో మారిజాన్ కాప్ {40}, జమీమా రోడ్డ్రిగ్స్ {30}, నీకీ ప్రసాద్ {25*} మినహా మిగతా బ్యాటర్లు ఏవ్వరు రాణించలేదు. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది.

Also Read: Zaheer Khan: జహీర్ ఖాన్‌కు ‘ఐ లవ్ యూ’… 20 ఏళ్ల తర్వాత !

చివరి బంతికి పది పరుగులు చేయాల్సి ఉండగా.. కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది. దీంతో ముంబై జట్టు 8 పరుగుల తేడాతో టైటిల్ ని ఎగరేసుకుపోయింది. కాగా ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకోవడం ఇది రెండోసారి. ఇక మూడు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్ కీ చేరి.. మూడుసార్లు ఫైనల్స్ లో రన్నరప్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో దరిద్రం అంటే వీళ్ళదే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు క్రీడాభిమానులు. ఈ లీగ్ మొత్తంలో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రెండు ముంబై ఇండియన్స్ ప్లేయర్ వద్దే ఉండడం విశేషం. ఆరెంజ్ క్యాప్ నీ బ్రంట్, పర్పుల్ క్యాప్ ని అమేలీయా కేర్ సాధించింది.

 

 

View this post on Instagram

 

Tags

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×