Big TV Kissik Talks : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమిట్మెంట్ ల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలలో కొందరు ఇండస్ట్రీలో జరుగుతున్న కమిట్మెంట్ల గురించి బయటకు చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో వీటి ప్రభావం ఎలా ఉందనే విషయం గురించి బయటపెట్టారు. దీనిపై ఇండస్ట్రీలో ఎన్నో రకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ కమిట్మెంట్స్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఆమె ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఇంటర్వ్యూ లో ఏం చెప్పారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Also Read: ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆదివారం ఆ మూవీలు వెరీ స్పెషల్..
ఇంటర్వ్యూ లో అన్నపూర్ణ ఏం అన్నారు..?
టాలీవుడ్ నటి అన్నపూర్ణ ఇటీవల బిగ్ టీవీ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీ గురించి ఈ నడుమ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారన్నారు. ఇండస్ట్రీలో ఎవరినీ బలవంతం చేయరు. అది వారి ఇష్టంగానే జరుగుతుంది. ట్యాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు రావనేది నేను నమ్మను. ఏదో మీడియాలో హైలెట్ కావడానికే కొందరు అలాంటి కామెంట్లు చేస్తున్నారనిపిస్తోంది. ఇండస్ట్రీ మనందరిది. దాన్ని కరెక్టుగా వినియోగించుకుంటే మంచి అవకాశాలు వస్తాయి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ నడుమ అన్నపూర్ణమ్మ ఇంటర్వ్యూలలో చేస్తున్న కామెంట్లు ఆసక్తిరేపుతున్నాయి.. అప్పటిలో ఇలాంటివి అయితే లేవు కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటివి వినిపిస్తున్నాయి. ఏదైనా కూడా ఎవరి బలవంతం మీద అవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడో జరిగిన దాన్ని పట్టుకొని ఇప్పుడు ఇలా బయటకు లాగడం అంత మంచి పని కాదు అనే చెప్పాలి.. మీడియాలో హైలైట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో కొందరు బయటకు వస్తున్నారని ఆమె అన్నారు. ఆరోజుల్లో విలువలతో కూడిన కమిట్మెంట్లు ఉండేవి. నేను అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్ కి పని చేశాను కాబట్టి నన్ను అలా ఎవరూ అడగలేదు. నిజం చెప్పాలంటే కమిట్మెంట్ అనేది మన మనస్సుపై ఆధారపడి ఉంటుంది.. ఇండస్ట్రీలో బలవంతం అయితే ఎవరూ చేయరని ఆమె అన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది..
అన్నపూర్ణమ్మ నటన ప్రస్థానం..
అన్నపూర్ణమ్మ ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉంది. నా 13వ ఏట రంగేసుకొని ఇండస్ట్రీకి వచ్చాను అంటూ తన సినీ కెరీర్ గురించి గుర్తుచేసుకున్నారు అన్నపూర్ణమ్మ.. తన ఫ్యామిలీ గురించి చెప్తూ.. ముగ్గురు అక్కాచెల్లెళ్లం. ఒక్క అన్న, తమ్ముడు ఉన్నారు. మా అమ్మ పోయారు, నాన్న పోయారు. నా పాప చనిపోయింది అని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు అన్నపూర్ణమ్మ. ఎవరైనా లేరని తెలిసినప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. వాళ్లు చాలా గుర్తొస్తారు. తెల్లవారుజామున గుర్తొస్తారు. ఏమైనా తినేటప్పుడు గుర్తొస్తారు. వాళ్లకు ఇష్టమైనది మనం తినేటప్పుడు గుర్తుకు వస్తారు. అని తన జీవితంలో ఎదురైనా చేదు అనుభవాల గురించి బయట పెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.