Rohit Sharma – Maldives: 20 రోజులపాటు క్రీడాభిమానులను ఎంతగానో అలరించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మార్చ్ 9 ఆదివారం రోజున ముగిసింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ రన్నరప్ తో సరిపెట్టుకుంది. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత జట్టు ఛాంపియన్ ట్రోపీని గెలుచుకుంది.
Also Read: Zaheer Khan: జహీర్ ఖాన్‌కు ‘ఐ లవ్ యూ’…20 ఏళ్ల తర్వాత !
అదే సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు రెండవసారి ఐసీసీ ట్రోఫీని గెలిచింది. ఇక చాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} పై 2025 పడింది. ఈ సీజన్ ఈసారి ముందుగానే రాబోతోంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో ప్రారంభమయ్యే ఈ ఐపీఎల్.. ఈసారి మార్చ్ లోనే ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ 2025.. 18 ఎడిషన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది.
ఈ సీజన్ మే 25న జరగబోయే ఫైనల్ తో ముగుస్తుంది. దీనికి సంబంధించిన ఐపిఎల్ షెడ్యూల్ ని కూడా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోయే ఈ ఐపీఎల్ సీజన్ లో మొత్తం 13 వేదికలలో 74 మ్యాచ్ లు.. 65 రోజులపాటు జరుగుతాయి. ఇందులో 12 డబుల్ – హేడర్ మ్యాచ్ లు ఉన్నాయి. తొలి మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లు తెలపడనున్నాయి.
ఇక చాంపియన్స్ ట్రోఫీకి, త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ కి మధ్య కాస్త సమయం దొరకడంతో.. ఈ సమయాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని అందించిన అనంతరం రోహిత్ శర్మ.. తన భార్య రితిక సజ్దే, కుమార్తె సమైరాతో కలిసి మాల్దీవుల్లో ఓ అద్భుతమైన సెలవును ఎంజాయ్ చేస్తున్నారు.
విశేషమేంటంటే.. గత సంవత్సరం కూడా రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి మాల్దీవులను సందర్శించాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించిన అనంతరం మరోసారి కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తున్నాడు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలను రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. మరోవైపు భారత ఆటగాళ్లు అంతా తమ తమ ఐపిఎల్ ఫ్రాంచైజీలతో ఇప్పటికే కలిసిపోయారు.
Also Read: JioStar – IPL 2025: IPL 2025తో అంబానీ పంట పండటం ఖాయం..10 సెకన్లకు రూ.20 లక్షలా?
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ లోని ప్రధాన సభ్యులందరూ ప్రాక్టీస్ సెషన్ కూడా ప్రారంభించారు. అయితే రోహిత్ శర్మ మాత్రం కాస్త సమయం తీసుకుని మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం యూరప్ కి వెళ్ళనుంది. ఈ సిరీస్ కి భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.