
Kane Williamson : అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన వన్డే వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్ పోరు ముగిసింది. టీమ్ ఇండియా బీభత్సమైన ఫామ్ కి కివీస్ దాసోహమైంది. అయితే మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడాడు. సెమీస్ లో మేం చివరి వరకు పోరాడం. కాకపోతే మా ఓటమికి ఆ ముగ్గురే కారణమని అన్నాడు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే.. తన మాటల్లోనే విందాం.
ఫైనల్ చేరిన టీమిండియాకు అభినందనలు అంటూ కేన్ మామ చెప్పడం ప్రారంభించాడు. ఈ విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులు. ఈ మెగా టోర్నమెంట్ లో ఆ జట్టు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటుంది. ఈ విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులని చెప్పాలి. అయితే మావాళ్లు చూపిన పోరాటం కూడా అసమాన్యమైనది. అది చూసి గర్వపడుతున్నానని అన్నారు.
ఇంతకీ కివీస్ ఓటమికి కారణమైన ఆ ముగ్గురు ఎవరంటే.. ఒకరు కింగ్ కోహ్లీ, రెండు శ్రేయాస్, మూడు మహ్మద్ షమీ.. బ్యాటింగ్ లో ఆ ఇద్దరిని నిలువరించలేకపోయాం. అలాగే బౌలింగ్ లో షమీకి ఎదురు నిలవలేకపోయామని అన్నాడు. కాకపోతే నాకౌట్‌లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నాడు.
400 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినా సరే మావాళ్లు చక్కగా పోరాడారు. బంతి బ్యాట్ మీదకి వచ్చేటప్పుడు ఆడటం చాలా కష్టమైందని వివరించారు. ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. కానీ మొత్తం భారత్‌కే మద్దతు తెలిపారని నవ్వుతూ అన్నాడు.
భారత్ ఆతిథ్యమిచ్చే టోర్నీలో పాల్గొనడం ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని తెలిపాడు. అలాగే ప్రజలు, ఆటగాళ్లు సైతం మాతో ఎంతో స్నేహంగా ఉన్నారు. భారత్ అంటే ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంటుందని అన్నారు. అదెప్పటికి మరిచిపోలేమని అన్నాడు. అతిథి మర్యాదల్లోగానీ, అభిమానం చూపించడం లోగానీ, స్నేహంలోగానీ ఇలా అన్నిరకాలుగా మేం సొంత ఊరిలో ఉన్నట్టే ఫీలయ్యామని అన్నాడు.
ప్రపంచకప్‌కి వచ్చేసరికి మాకు ఒక విలువైన బ్యాటర్ దొరికాడు. అతనే రచిన్ రవీంద్ర అని తెలిపాడు. ఇక డారిల్ మిచెల్ అయితే అసాధారణ ప్రదర్శన చేశాడని కొనియాడాడు. బౌలర్లు కూడా అద్భుతంగా పోరాడారు. ఇక దీనిని ఇక్కడితో వదిలిపెట్టి తదుపరి సిరీస్‌లకు సిద్దమవుతాం’అని కేన్ మామ తెలిపాడు.