BigTV English

Shakib Al Hasan :  బంగ్లా కెప్టెన్ ఎంపీ అయ్యాడు .. షకీబ్ పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్

Shakib Al Hasan :  బంగ్లా కెప్టెన్ ఎంపీ అయ్యాడు .. షకీబ్ పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్
Shakib Al Hasan

Shakib Al Hasan : బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే ఘటన ఒకటి ఉంది. వన్డే వరల్డ్ కప్ 2023లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజిలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్ అయి చరిత్ర సృష్టించాడు. ఇంతకీ తనని అలా అవుట్ చేసిన కెప్టెన్ గా షకీబ్ అంతకన్నా ఎక్కువ అపప్రథ మూటగట్టుకున్నాడు.


దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అతను వివాదాల సుడిలో చిక్కుకున్నాడు. ఈ టైమ్డ్ అవుట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ కోచ్ కూడా పదవిని వదిలి తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. అంతటి సెన్సేషన్ వివాదానికి  36 ఏళ్ల షకీబ్ నాంది పలికాడు. అలాంటి షకీబ్ సడన్ గా రాజకీయాల్లోకి టర్న్ అయ్యాడు.

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ‘మగురా-1’నియోజకవర్గం నుంచి అధికార అవామీ లీగ్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అలా తన సెకండ్ ఇన్నింగ్స్ ని ఘనంగా ప్రారంభించాడు.


ఇంకా తను క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోలేదు. మరి ఎంపీగా ప్రజాసేవ చేస్తూ క్రికెట్ ఆడతాడా? లేదా? అనేది ఇంకా తెలీదు. అయితే బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన 12వ సార్వత్రిక ఎన్నికల్లో షకిబ్ అల్ హసన్ గెలుపొందాడు. ప్రస్తుత ప్రధాన షేక్ హసీన్ నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మళ్లీ అధికారంలోకి రానుంది. ఈ నేపథ్యంలో షకీబ్ కి మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

కెప్టెన్ షకీబ్ కు ఎన్నికల్లో 1,85,388 ఓట్లు పడ్డాయి.  బంగ్లాదేశ్ కాంగ్రెస్‌కు చెందిన సమీప ప్రత్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్‌కు 45,993 ఓట్లు వచ్చాయి. అయితే ఇంకా రాజకీయాల్లోకి ఎంటర్ అవకుండానే  పోలింగ్ రోజున షకీబ్ అల్ హసన్ ఓ వ్యక్తి  చెంప చెల్లుమనిపించాడు. ఇంతకీ సదరు బాధితుడు చేసిన నేరం ఏమిటంటే ఒక ఫొటో అడిగాడు. రాజకీయాల్లోకి వెళుతూ కూడా ఇలా చేస్తే, వచ్చే ఎన్నికల్లో ఓట్లు కాదు రాళ్లు పడతాయని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

షకిబ్ అల్ హసన్ స్పిన్ బౌలర్ మాత్రమే కాదు.. మంచి బ్యాటర్ కూడా.. ఎన్నో పరుగులు సాధించాడు.. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 66 టెస్టులు, 247 వన్డేలు, 117 టీ20 మ్యాచులు ఆడాడు. బౌలింగ్‌లో టెస్టుల్లో 233 వికెట్లు తీశాడు. అలాగే 121 ఇన్నింగ్సుల్లో 4454 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 1 డబులు సెంచరీ ఉన్నాయి. ఇక వన్డేల్లో  317 వికెట్లు తీయడమే కాదు, 7570 పరుగులు చేశాడు. తర్వాత 117 టీ20 మ్యాచుల్లో 2382 పరుగులు చేసి, 140 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో  71 మ్యాచుల్లో 793 రన్స్ చేసి.. 63 వికెట్లు తీశాడు.

బంగ్లాదేశ్ క్రికెట్ ఉన్నతికి కృషి చేసిన వారిలో షకీబ్ కూడా ఒకరని చెప్పాలి. అందుకే ప్రజలు బంపర్ మెజార్టీ ఇచ్చి మరీ ఆశీర్వదించారు. క్రికెట్ లో వివాదాలతో గడిపిన షకీబ్, రాజకీయాల్లో ఆ వైపు వెళ్లకూడదని అభిమానులు కోరుతున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×