BigTV English

Shikhar Dhawan- Chahal : బాహుబలిలా ధావన్.. చత్రపతి శివాజీ ఇలా చాహల్.. ఇద్దరూ పెళ్ళాలను వదిలేసి!

Shikhar Dhawan- Chahal :  బాహుబలిలా ధావన్.. చత్రపతి శివాజీ ఇలా చాహల్.. ఇద్దరూ పెళ్ళాలను వదిలేసి!

Shikhar Dhawan- Chahal : సాధారణంగా క్రికెటర్ల జీవితాల్లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. క్రికెటర్లు ఆట మీదనే కాదు.. తమ జీవితంలో జరిగే సంఘటన వల్ల కూడా కొందరూ క్రికెట్ లో రాణించలేకపోతున్నారు. దీంతో వారు అవకాశాలు కోల్పోతున్నారు. వీటికి తోడు గాయాలు కావడం.. ఫామ్ కోల్పోవడం వంటి సంఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా క్రికెటర్ శిఖర్ ధావన్ బాహుబలి గెటప్ వేయగా.. మరో క్రికెటర్ చాహల్ ఛత్రపతి శివాజీ గెటప్ లు వేశారు. ఇంకో విచిత్రం ఏంటంటే..? రెండు సినిమాల్లో కూడా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించడం విశేషం. మరోవైపు వీరిద్దరూ కూడా పెళ్లాలను వదిలేయడం గమనార్హం.


Also Read :  Austraila – WC 2023 : ఆస్ట్రేలియా పతనం ఇక్కడి నుంచే మొదలైంది… అప్పుడు బలుపు చూపించకపోతే బాగుండు

శిఖర్ ధావన్ ఒకప్పుడు టీమిండియా ఓపెనర్ గా క్రికెట్ లో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ, ధవన్ ఓపెనింగ్ చేసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. తరువాత భారత క్రికెట్ శిఖర్ ధావన్ కి ఆయన భార్య ఆయేషా ముఖర్జి నుంచి ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది. 2012 అక్టోబర్ లో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు ధావన్. శిఖర్ ధావన్ ఆరోపణలను సమర్థించిన కోర్టు.. ఆయేషా క్రూర ప్రవర్తన కారణంగానే విడాకులు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించింది. శిఖర్ ధావన్ ను భార్య ఆయేషా మానసికంగా వేధించినట్టు సమాచారం. ఆయేషా తొలుత శిఖర్ ధావన్ తో కలిసి భారత్ లో ఉండేందుకు ఒప్పుకున్నప్పటికీ.. ఆ తరువాత తన మొదటి భర్త కలిగిన సంతానాన్ని చూసుకునేందుకు ఆస్ట్రేలియాలోనే ఆయేషా ఉండిపోయింది. ఇక తన కెరీర్ విషయానికొస్తే.. 13 ఏళ్ల కెరీర్ లో 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. 2010లో ధావన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. తన కెరీర్ లో 167 మ్యాచ్ ల్లో 6783 పరుగులు చేశాడు ధావన్. వన్డేల్లో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో ధావన్ వ్యక్తిగత అత్యధిక స్కోర్ 190 పరుగులు చేసాడు.


ఇక మరో క్రికెటర్ యజువేంద్ర చాహల్ విషయానికొస్తే.. చాహల్ అంతర్జాతీయ క్రికెట్ లో 72 వన్డే మ్యాచ్ లు, 80 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. 2016 జింబాబ్వే పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేసాడు. 2025లో పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. చాహల్ హ్యాట్రిక్ వికెట్లు కూడా తీయడం విశేషం. చాహల్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఆమెకి విడాకులు ఇచ్చేశాడు. చాహల్, ధనశ్రీ కరోనా సమయంలో 2020లో పెళ్లి చేసుకున్నారు.  వీరి జీవితం సాఫీగా నాలుగేళ్లు కూడా గడవకముందే గొడవలు,వివాదాలు తలెత్తి.. విడాకుల వరకు దారి తీసింది. పెళ్లి తరువాత వీరి తొలుత హర్యానాలో ఉండేవారు. ఆ తరువాత ముంబై కి మారాలని ధనశ్రీ మారాం చేసింది. చాహల్ ఒప్పుకోకపోవడంతోనే వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని.. అందుకే వీరు విడాకులు తీసుకున్నారని అప్పట్లో వార్త వైరల్ అయింది. తాజాగా ఈ ఇద్దరూ క్రికెటర్లు బాహుబలి, ఛత్రపతి శివాజీ వేషంలో కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

?igsh=MWlzdm51emJwZjhlYQ==

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×