IND Vs PAK : ఆసియా కప్ 2025 లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదిలా ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న వేళ.. ఎంపీ అనురాగ్ ఠాగూర్, ఐసీసీ చైర్మన్ జైషా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిది అఫ్రిది పక్కనే కూర్చొని ముచ్చట పెట్టా రు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది. ఓవైపు పాకిస్తాన్ కి ఉగ్రవాదులు భారత్ పై దాడి చేస్తుంటే.. జైషా ఏకంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తో సరదా ముచ్చట్లతో కాలం గడుపుతున్నాడని ట్రోలింగ్స్ చేస్తున్నారు.
Also Read : No Handshake : పాకిస్థాన్ ఇజ్జత్ తీసిన ఇండియా..నో షేక్ హ్యాండ్స్…ముఖం మీదే డోర్లు వేశారు
అసలు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడొద్దనే చెబుతుంటే.. ఏకంగా పాకిస్తాన్ ఆటగాళ్లతో ఐసీసీ చైర్మన్ జైషా ఇలా ముచ్చట పెట్టడం ఏంటి..? అని ప్రశ్నించడం విశేషం.ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై “BoycottIND Vs PAK అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. టెర్రరిస్టులతో క్రికెట్ వద్దు అంటూ కామెంట్స్ చేస్తే.. ఐసీసీ చైర్మనే ఏకంగా పాకిస్తాన్ క్రికెటర్లతో కలిసి ముచ్చటేయడం టీమిండియా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ముఖ్యంగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ను చూడకుండా టీవీలు ఆఫ్ చేసి పహల్గామ్ దాడి బాధితులకు అండగా నిలవాలని కొంతమంది కోరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటివి ఏంటి..? అంటూ ప్రశ్నిస్తున్నారు టీమిండియా అభిమానులు.
మరోవైపు మ్యాచ్ ని పరిశీలించినట్టయితే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్.. బుమ్రా బౌలింగ్ లో పాక్ ఓపెనర్ అయూబ్ 6 బంతుల్లో 6 సిక్స్ లు కొడతాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో తొలి బంతికే అదే బుమ్రా కి క్యాచ్ ఇచ్చి డకౌట్ కావడం గమనార్హం. మరో ఓపెనర్ ఫర్హాన్ (40) షాహిన్ అఫ్రిది (33) మినహా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, అక్షర్ 2, బుమ్రా 2, వరుణ్ 1, హార్దిక్ పాండ్యా 1 చొప్పున వికెట్లు తీసుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు అభిషేక్ శర్మ 31, శుబ్ మన్ గిల్ 10, సూర్య కుమార్ యాదవ్ 47 నాటౌట్, తిలక్ వర్మ 31, శివమ్ దూబే 10 నాటౌట్ గా నిలిచారు. ఇక 15.5 ఓవర్లలో 131/3 పరుగులు చేసింది టీమిండియా. దీంతో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన తరువాత పాకిస్తాన్ జట్టుకు టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తగిన గుణపాఠం చెప్పింది. అలాగే టాస్ వేసే సమయంలో కూడా కెప్టెన్ సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.
Anurag Thakur, Jay Shah, and Shaheed Afridi in stadium watching the India Pakistan match
And true patriots are saying – Desh ke gaddaron ko , g0li maaro Saalon ko pic.twitter.com/IhcaSDlVh4
— Yanika_Lit (@LogicLitLatte) September 14, 2025