BigTV English

Shardul Thakur: పడి లేచిన కెరటం… Un sold ప్లేయర్ నుంచి తోపు ఆటగాడిగా రికార్డ్ !

Shardul Thakur: పడి లేచిన కెరటం… Un sold ప్లేయర్ నుంచి  తోపు ఆటగాడిగా రికార్డ్ !

Shardul Thakur: మూడు సంవత్సరాల క్రితం జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని గబ్బా టెస్ట్ లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్ ఠాకూర్.. వాషింగ్టన్ సుందర్ తో కలిసి 7వ వికెట్ కి 123 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 67 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలింగ్ లో కూడా ఏడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా టెస్టుల్లో చాలాసార్లు టీమిండియా విజయాలలో కీలకపాత్ర పోషించాడు.


 

అలాంటి శార్దూల్ ఠాకూర్ ని 2025 ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. 2022 మెగా వేలంలో 10.75 కోట్ల ధర పలికిన శార్దూల్ ఠాకూర్.. ఈసారి కనీసం బేస్ ప్రైస్ కి కూడా అమ్ముడుపోలేదు. గాయం, ఫిట్నెస్ సమస్యలతో టీమ్ ఇండియాలో స్థానం కోల్పోయిన శార్దూల్ ఠాకూర్.. ప్రస్తుతం దేశవాళీ టోర్నీలో మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకముందే పలువురు కీలక ప్లేయర్లు ఈ సీజన్ మొత్తానికి దూరం కావలసి వచ్చింది.


వీరిలో యువ బౌలర్ మోహ్సిన్ ఖాన్ గాయం కారణంగా 2025 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ ని లక్నో తన జట్టులోకి తీసుకుంది. రెండు కోట్ల బేస్ ధరతో లక్నో జట్టులో స్థానం దక్కించుకున్నాడు శార్దూల్. ప్రాక్టీస్ సెషన్స్ లో తన అనుభవాన్ని రంగరించి బ్యాటర్లకు సవాల్ విసిరే బంతులను సంధించాడు. ఇక లక్నో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆవేష్ ఖాన్ గాయంతో మ్యాచ్ కి దూరం కావడంతో తొలి మ్యాచ్ లోనే శార్దుల్ కి అవకాశం దక్కింది.

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కేవలం రెండు ఓవర్లలోనే శార్దూల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన రెండవ మ్యాచ్ లో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు విధ్వంసకర సన్రైజర్స్ బ్యాటర్లు.. 300 పరుగులకు పైగా స్కోర్ చేయడం ఖాయమని అంతా భావించారు. కానీ హైదరాబాద్ బ్యాటర్లకు శార్దూల్ ఠాకూర్ కళ్లెం వేశాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లను పెవిలియన్ చేర్చి హైదరాబాద్ కి గట్టి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత అభినవ్ మనోహర్, మహమ్మద్ షమీని కూడా అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన శార్ధూల్.. 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు.

 

ఇక మ్యాచ్ అనంతరం శార్దూల్ మాట్లాడుతూ.. ” ఆరోజు నాకు బ్యాడ్ డే. వేలంలో నన్ను ఎవరు కొనుగోలు చేయలేదు. అయితే తమ బౌలర్లకు గాయాలు కావడంతో లక్నో నన్ను సంప్రదించింది. ఇలాంటివి జరుగుతుంటాయి. జహీర్ ఖాన్ వంటి దిగ్గజం ఉండగా దీనిని అంగీకరించాల్సి వచ్చింది. నాకు గెలుపే ముఖ్యం. వికెట్లు లేదా పరుగుల గణాంకాలను చూచుకోవడం ముఖ్యం కాదు. నేను ప్రతి మ్యాచ్ లో విజయం సాధించాలనుకుంటాను. ఈరోజు మ్యాచ్ ప్రారంభంలోనే పరిస్థితులు మాకు అనుకూలంగా మారాయి” అని చెప్పుకొచ్చాడు.

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×