Big Stories

Shikhar Dhawan plans : శిఖర్ ధావన్‌ ఫ్యూచర్ నిర్ణయించేది ఈ సీజనే.. ప్లాన్ వర్కౌట్ చేసే పనిలో గబ్బర్

Shikhar Dhawan plans

Shikhar Dhawan plans : ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ మోస్ట్ కన్‌సిస్టెన్స్ ప్లేయర్. గత సీజన్‌లో 460 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లోనూ దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటికే గబ్బర్ ఖాతాలో 233 పరుగులు ఉన్నాయి. భుజం గాయం కారణంగా గత మ్యాచ్ ఆడలేకపోయాడు. నెక్ట్స్ మ్యాచ్‌ వరకు అందుబాటులోకి వస్తాడని మేనేజ్‌మెంట్ చెబుతోంది. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టుకు శిఖర్ ధావనే కీలకం. ఈసారి టైటిల్ గెలుస్తామన్న హోప్ పెట్టుకుందంటే.. దానికి కారణం గబ్బర్. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండు సార్లు మాత్రమే ఔట్ అయ్యాడు. ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక్కడితో సరిపోదు.. గబ్బర్ కు ఈ సీజన్ చాలా చాలా ఇంపార్టెంట్. తన ఫ్యూచర్ కు కూడా.

- Advertisement -

వచ్చే వరల్డ్ కప్‌లో కచ్చితంగా ఆడాలనేది శిఖర్ ధావన్ కోరిక. కాని, ఫుల్ కాంపిటిషన్ ఉంది. ఓపెనింగ్ పొజిషన్‌కైతే కనీసం ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్లందరినీ కాదని శిఖర్ ధావన్ నే తీసుకోవాలంటే ఏదో మ్యాజిక్ జరగాల్సిందే. ఆ మ్యాజిక్‌కే ఈ ఐపీఎల్ సీజన్. పర్సనల్‌గానూ మంచి యావరేజ్, సూపర్ స్ట్రైక్ రేట్‌తో సత్తా చాటాలి. పర్పుల్ క్యాప్ పట్టాల్సిందే. ఇక టైటిల్ కూడా గెలిస్తే.. శిఖర్ కు తిరుగులేదు. ఇదే జరగాలని కోరుకుంటున్నాడు శిఖర్. ఐపీఎల్‌లో మెరిస్తే.. ఆసియా కప్ జట్టులో కచ్చితంగా ప్లేస్ ఇవ్వాల్సిందే. అందులో సక్సెస్ అయితేనే వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో ఉంటాడు. సో, వరల్డ్ కప్ వరకు వెళ్లాలంటే.. ముందు ఆసియా కప్‌లో సత్తా చాటాలి. ఆసియా కప్ వరకు వెళ్లాలంటే.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఓ రేంజ్‌లో కుమ్మేయాలి.

- Advertisement -

ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు గబ్బర్. వచ్చే వరల్డ్ కప్‌లో తనను ఎంపిక చేసేలానే తన బ్యాటింగ్ అటాక్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అదేంటో గానీ ఐపీఎల్ కెరీర్‌లో విరాట్ కొహ్లీ చేసిన మొత్తం పరుగులు 6838. ఆ తరువాత ప్లేస్‌లో ఉన్నది గబ్బర్ సింగే. 6477 పరుగులతో దాదాపు కొహ్లీ యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్‌తో ఉన్నాడు. కాని, కొహ్లీకి ఉన్నంత క్రేజ్ రాలేదు. ఈ సీజన్‌లో కొహ్లీ పరుగులను కూడా మించేతే కచ్చితంగా ఫోకస్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. సో, ఆల్ ద బెస్ట్. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News