Shikhar Dhawan Sophie Shire: ఒకప్పుడు టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా ఉన్న శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 2012లో ఆస్ట్రేలియాకి చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని శిఖర్ ధావన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మనస్పర్ధలు రావడం వల్ల కొంతకాలం దూరంగా ఉన్న వీరిద్దరూ.. విడిపోతున్నట్లు 2021లో ప్రకటించారు. తన భార్య మానసికంగా వేధిస్తుందని ఆరోపిస్తూ శిఖర్ ధావన్ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేశాడు.
దీంతో గత సంవత్సరం ఈ జంటకి విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం. ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 సందర్భంగా శిఖర్ ధావన్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఓ మిస్టరీ గర్ల్ తో స్టాండ్స్ లో కూర్చొని కనిపించాడు ధావన్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజెన్లు ఆమె ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆమె ఐర్లాండ్ కి చెందిన సోఫీ షైన్ అని, ఆమెతో ధావన్ గత కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
వీరిద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ధావన్ కూడా ఆమెతో రిలేషన్ షిప్ లో ఉన్నానని అధికారికంగా ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాజాగా ధావన్ ఆమెతో కలిసి రీల్స్ కూడా చేశాడు. ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ రీల్ ఇంస్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది. ఓ హిందీ సినిమాలోని డైలాగ్ కి శిఖర్ ధావన్ – సోఫీ రీల్ చేశారు.
ఇందులో ఆ అమ్మాయి.. ” గురూజీ ఇక్కడి నుండి వెళ్లాలని లేదు. నేను నీతోనే ఉండాలని కోరుకుంటున్నా” అనే డైలాగ్ ఆమె చెప్పగా.. ” ఇంట్లో పని చేసేందుకు వస్తావా..?” అంటూ శిఖర్ ధావన్ డైలాగ్ చెబుతాడు. దీంతో ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. గబ్బర్ భాయ్ రిలేషన్ షిప్ అనౌన్స్ చేసేసాడని కామెంట్స్ చేశారు. అంతేకాదు ఇటీవల ప్రేమ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ధావన్. తాను ఎల్లప్పుడూ లవ్ లో ఉంటానని, రిలేషన్ షిప్ లో ముందుకు వెళుతున్నానని అన్నాడు.
ప్రేమించడంలో నేను దురదృష్టవంతుడిని కాదు, ప్రేమలో ఉన్నప్పుడు నాకు అనుభవం ఉంది, అదే మంచి ప్రేమను ఎంచుకునేందుకు ఉపయోగపడుతుంది, ప్రేమలో మంచి, చెడు రెండు సందర్భాలు ఉంటాయని.. వాటన్నింటికీ తాను విధేయుడినని వ్యాఖ్యానించాడు. ఇలా మరోసారి వార్తల్లో నిలిచాడు శిఖర్ ధావన్. అయితే తాజాగా శిఖర్ ధావన్ – సోఫి షైన్ కి సంబంధించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. కానీ పెళ్లికి ముందే సోఫీ షైన్ ప్రెగ్నెంట్ అన్న సంచలన వార్త వైరల్ గా మారింది. అయితే దీనిపై ఈ జంట స్పందిస్తుందా.? లేదా..? అన్నది వేచి చూడాలి. ఇక 2024 ఆగస్టు 24న శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. తన కెరీర్ లో భారత్ తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 2,315 పరుగులు, వన్డేల్లో 6,793 పరుగులు, టి-20ల్లో 1,759 పరుగులు చేశాడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">