Shikar Dhawan : టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంటే.. మన క్రికెటర్ శిఖర్ ధావన్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ధావన్ ప్రేయసీ సోఫీ షైన్.. అలాగే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి ఓ ప్రత్యేక మ్యూజిక్ వీడియోలో సందడి చేశారు ధావన్. వీరిద్దరూ కలిసి నటించిన బెసోస్ అనే ఆల్బమ్ విడుదల అయింది. ఆ సమయంలో ధావన్ సరికొత్త లుక్ లో కనిపించారు. ఇక ఈ సాంగ్ ఉత్సాహభరితమైన, ఎనర్జిటిక్ మెలోడీతో ఆకట్టుకుంటోంది. ఇందులో శిఖర్ ధావన్, జాక్వెలిన్ తో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ద్వారా ధావన్ లో మరో కోణం దాగి ఉందని అభిమానులు ఆస్వాదిస్తున్నారు.
Also Read : Shoaib – Rahul Dravid : S-400 దెబ్బ అదుర్స్ కదూ… రాహుల్ ద్రావిడ్, అక్తర్ వీడియో వైరల్…
ఇక గతంలో ధావన్ డబుల్ ఎక్స్ఎల్ మూవీలో అతిథి పాత్రలో కనిపించాడు. బెసోస్ మ్యూజిక్ వీడియోలో మాత్రం పూర్తి స్థాయిలో నటించాడు. అయితే ఆ మ్యూజిక్ వీడియో వద్దకు ధావన్ తన ప్రేయసీ సోఫీ షైన్ తో కలిసి వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిద్దరితో కలిసి ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో శిఖర్ ధావన్ తన ప్రేయసితో విమానాశ్రయంలో బయటికి నడుస్తూ కనిపించాడు. బెసోస్ మ్యూజిక్ వీడియో ఫంక్షన్ లో వేసుకున్నటువంటి ఎర్రని బాలెన్సియాగా టీ షర్ట్, నల్ల జాగర్లు, ఎర్రటి స్నీకర్లతో స్టైలిష్ గా కనిపించాడు. ఇక ఇదే సమయంలో సోఫీ షైన్ కూడా చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు.
గత ఏడాది శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయిన తర్వాత, చాలా నిశ్శబ్దంగా ఉండే ప్రయత్నం చేశారు. సోఫీ షైన్ ఈ జంట ప్రేమకథను బయటపెట్టాలని నిర్ణయించుకుంది. గత వారం, సోఫీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “నా” అంటూ ఒక మధురమైన పోస్ట్ పంచుకుంది. ఈ పోస్ట్ అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ విధంగా ఆమె ఈ ప్రేమను అధికారికంగా ప్రకటించింది. శిఖర్-సోఫీ ఈ ప్రేమకథను జూన్ 2023లో ప్రారంభించారు. అయితే ఇంత వరకు ప్రకటించలేదు. మొదట, ధావన్ సోఫీ షైన్ పోస్ట్‌లలో ఒకదాన్ని లైక్ చేయడంతో ఈ కథ మొదలైంది. మొదటి చూపులో అది ఒక సాధారణ స్నేహం వంటిదిగా కనిపించగా.. ఇక ఆ తరువాత అది ఒక ప్రేమకథగా మారింది. ఈ జంట దుబాయ్‌లో కలిసినట్లు చెబుతున్నారు. అక్కడ వారు స్నేహితులుగా పరిచయం అయ్యారు. అయితే తరువాత వారి మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడింది. ఈ జంట ప్రస్తుతం ఒక సంవత్సరం పాటు కలిసి ఉంటున్నట్లు సమాచారం. అందుకే వారు తరచూ కలిసి కనిపించడం.. తమ ప్రేమను వ్యక్తం చేయడం జరుగుతుంటున్నాయి. మొత్తానికి ధావన్ ఇద్దరితో ఎంజాయ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.