Naveen Chandra: యంగ్ హీరో నవీన్ చంద్ర హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇటీవల వచ్చిన 28 డిగ్రీల సెల్సియస్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ తో నూతన దర్శకుడితో తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా లెవెన్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం మే 16న రిలీజ్ కానుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, విచ్చేశారు.అందులో భాగంగా హీరో నవీన్ చంద్ర ఆసక్తికరమైన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ వివరాలు చూద్దాం..
దీన్ని డీ కోడ్ చేస్తే మీరు అడిగింది ఇస్తా..
నవీన్ చంద్ర విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. హీరో గా చేస్తూ వేరే మూవీస్ లో క్యారెట్ ఆర్టిస్ట్ గాను నటించడం నవీన్ చంద్రకే సాటి. ఇటీవల వచ్చిన గేమ్ చేంజర్ మూవీలో ఓ మంచి క్యారెక్టర్ తో ప్రేక్షకులను మెప్పించారు. ఆ మూవీ తర్వాత 28 డిగ్రీ సెల్సియస్ అనే ఓ లవ్ స్టోరీలో నటించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు తాజాగా క్రైమ్ థ్రిల్లర్ లెవెన్ మూవీతో మన ముందుకు రానున్నారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎంతోమంది కష్టపడి పని చేశారు. సినిమాలో నటించిన నటీనటులందరూ క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా నటించారు. లోకేష్ దర్శకత్వం మీద ఆయన కథ మీద నాకు నమ్మకం ఉంది. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నా నమ్మకం. ఈ మూవీలో మొదటిసారి చూసినప్పుడు ఓ ఫీలింగ్ కలుగుతుంది. రెండోసారి మళ్లీ చూడండి అప్పుడు మీకు ఈ సినిమాలో కోడ్ అర్థమవుతుంది. లెవెన్ మూవీ టైటిల్ లోనే ఒక కోడ్ ఉంది దాన్ని డి కొట్ చేసి నాకు 16వ తారీకు లోపు చెప్పిన వాళ్ళకి ఒక సప్రైజ్ గిఫ్ట్ తో పాటు మీరు అడిగింది ఇస్తాను,అలాగే హగ్ కూడా ఇస్తాను. 16 తారీకు లోపు మీరు డి కొట్ చేయగలిగితే ఓకే లేదంటే రెండు సార్లు సినిమా చుస్తే వాళ్ళకి అర్థమవుతుంది అని నవీన్ చంద్ర తెలిపారు. ఇది చూసిన వారంతా లెవెన్ అనే టైటిల్ లో ఏముంది ఆ డీకోడ్ ఏంటా అని ఆలోచిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా హిట్ అవుతుందని నాకు నమ్మకం వుంది ..
ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ లోకేష్ అజ్లస్ మాట్లాడుతూ…ఒక మూవీకి కాస్టింగ్ సెట్ అయిందంటే ఆ మూవీ గెలిచినట్టే, అందరి పర్ఫామెన్స్ చాలా బాగున్నాయి.ఇక షూటింగ్ లోహీరోయిన్ అభిరామీ మేడం డెడికేషన్ చెప్పాలి తెలుగు పేపర్ ఆవిడకి ఇచ్చాను ముందు, రెండు రోజులు షూటింగ్ అని చెప్పను, కానీ ఒక రోజులోనే రెండు భాషల్లో డైలాగ్ చెప్పేసారు.అది ఎప్పుడు నాకు గుర్తు ఉంటుంది. రవివర్మ ఒక సీన్ ఉంటుంది తాగే శీను, ఎలా తాగాలని డింకర్స్ కి లెసన్ తీసుకుంటారు. తాగాలంటే ఇలానే తాగాలి అని ఆ సీన్ చూస్తే అర్థమవుతుంది. కిరీటి చాల బాగా చేసారు. శశాంక్ గారు మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. సెకండ్ డే షూటింగ్ షార్ట్ రెడీ, ఆయన టీ తాగుతున్నాడు. మీరు టీ తాగి రండి అన్న కానీ అయన వచ్చేసారు.షార్ట్ రెడీ అయిందా ముందు షార్ట్ ఆ తర్వాతే మన గురించి షార్ట్ రెడీ అయ్యాక మనం వెయిట్ చేయకూడదు అని ఆయన అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. హీరో చాల బాగా చేసారు.సినిమా చూసాక మీరే చెప్తారు అని తెలిపారు.