Pulivendula Victory: రాబోయే రోజుల్లో జగన్‌కు మరిన్ని షాకులు తగలనున్నాయా? కొన్ని నెలల్లో పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల గంట మోగనుందా? కడప టార్గెట్‌గా కూటమి పావులు కదుపుతోందా? ఆనాడు కుప్పం కాగా.. నేడు పులివెందుల వంతు కానుందా? అవుననే అంటున్నారు నేతలు.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పులివెందుల కోటపై టీడీపీ జెండా రెపరెపలాడింది. కూటమి ప్రభుత్వం ఇది కంటిన్యూ చేస్తోందా? లేకుంటే వైసీపీ పుంజుకుని పార్టీని విజయపథాన్ని నడిపిస్తుందా? కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. దీనిపై ఇప్పుడు చర్చ మొదలైంది.
గడిచిన దశాబ్దం కాలంగా ఏపీ రాజకీయాలు చంద్రబాబు వర్సెస్ జగన్ మధ్య సాగుతున్నాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వదులుకోలేదు. వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని చావుదెబ్బ కొట్టింది వైసీపీ.
కుప్పం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలతోపాటు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకుంది. గతేడాది అధికారంలోకి వచ్చిన టీడీపీ, కుప్పం మున్సిపాల్టీని తిరిగి కైవసం చేసుకుంది. చివరకు పులివెందుల కోటలో జడ్పీటీసీ సీటు రివర్స్ అయ్యింది. డిపాజిట్ ఇవ్వకుండా గెలిచి ప్రతీకారం తీర్చుకుంది టీడీపీ.
ALSO READ: శుక్రవారం నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్ధానాలకు ఉపఎన్నికలు రావడంతో ఎలాగైనా గెలవాలని ముందు నుంచే ప్రత్యేక వ్యూహాన్ని రెడీ చేశారు టీడీపీ నేతలు. దీటైన అభ్యర్ధులను బరిలోకి దించారు. టీడీపీ ఎత్తులకు వైసీపీ చిత్తయ్యింది. పులివెందుల జడ్పీ సీటులో డిపాజిట్ కోల్పోయి పరువు పొగొట్టుకుంది.
టీడీపీ ఘన విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు తొలుత రియాక్ట్ అయ్యారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్‌లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయంపై మంత్రులతో మాట్లాడారు. పులివెందులలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయన్నారు. తొలిసారి ఎన్నికలు జరగడంతో 11 మంది నామినేషన్లు వేశారని గుర్తు చేశారు.
మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశామని ఒక ఓటరు స్లిప్ రాసి పెట్టాడు. లెక్కింపు సందర్భంగా ఆ విషయం బయటపడింది. దాన్ని గమనిస్తే అక్కడ పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో గమనించాలన్నారు. పులివెందులలో జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.
ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ విజయంపై జిల్లాలో నాయకులంతా రియాక్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఈ లెక్కన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలోని పంచాయితీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూటమి వశం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని వైసీపీ నేతలు చర్చించు కుంటున్నారు. అదే జరిగితే ఓటమిని తట్టుకునే శక్తి జగన్ ఉందా? ఓటమి నుంచే గెలుపు పాఠాలు నేర్చుకుంటారా? ఇప్పుడున్న ఆలోచనను మాజీ సీఎం కంటిన్యూ చేస్తారా? అన్నది చూడాలి.
"30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను".. బ్యాలెట్ బాక్స్‌లో బయటపడిన చీటీ
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా బ్యాలెట్ బాక్స్‌లో దొరికిన చీటీ
30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను.. అందరికీ దండాలు అంటూ చీటీపై రాసి బ్యాలెట్ బాక్సులో వేసిన ఓ ఓటరు #ZPTCByElections… pic.twitter.com/pSLwXbKe3v
— BIG TV Breaking News (@bigtvtelugu) August 14, 2025