Sachin Tendulkar: క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తనదైన ఆటతీరుతో ఎన్నో విజయాలను టీమ్ ఇండియాకి అందించాడు సచిన్ టెండూల్కర్. ఇక అతడి తనయుడు అర్జున్ టెండూల్కర్ గురించి మాట్లాడుకుంటే.. అర్జున్ తన తండ్రి బాటలో పయనించేందుకు చాలా కష్టపడుతున్నాడు. అయితే అతనిపై ఉన్న అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నాడు.
Also Read: Grace Hayden on Pant: రిషబ్ పంత్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురు మోజు.. బోల్డ్ కామెంట్స్ వైరల్ !
ఇతను ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ మరియు ఎడమచేతి మిడిల్ ఆర్డర్ బ్యాటర్. అర్జున్ టెండూల్కర్ 2018లో శ్రీలంక పై అండర్ 19 మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇక 2020 – 21 లో ముంబై తరుపున టీ-20 మ్యాచ్ తో {సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ} ద్వారా సీనియర్ లెవెల్ లో దేశవాళీ కెరీర్ ని ప్రారంభించాడు. 2002లో ముంబై నుంచి గోవా జట్టుకు మారాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 17 మ్యాచ్ లు ఆడిన అర్జున్ టెండూల్కర్.. 532 పరుగులు చేసి.. 37 వికెట్లు పడగొట్టాడు. ఇక 2021 లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. త్వరలో సచిన్ టెండూల్కర్ కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొనబోతోంది.
సచిన్ టెండుల్కర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేశాడు. తన ప్రేయసి సానియా చందోక్ తో అర్జున్ నిశ్చితార్థం జరిగినట్లు జాతీయ మీడియా వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ నిశ్చితార్థ వేడుకకి ముంబైలో సచిన్ టెండుల్కర్ కి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం అత్యంత గోప్యంగా జరిగినట్లు సమాచారం. ఇప్పుడు ఈ వార్త బయటకి రావడంతో సోషల్ మీడియాలో అర్జున్ టెండూల్కర్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ కి కాబోయే జీవిత భాగస్వామి ఎవరూ..? అని తెలుసుకోవడానికి నిటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. సానియా ఘాయ్ కుటుంబానికి చెందిన యువతి. ఈమె ముంబైకి చెందిన ప్రసిద్ధ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఈమె ఎక్కువగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడంతో చాలామందికి ఈమె గురించి తెలియదు. సానియా ముంబైలోని అత్యంత ప్రముఖ వ్యాపార కుటుంబం అయిన ఘాయ్ ఫ్యామిలీ నుండి వచ్చింది. వీరికి ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్ తో పాటు బ్రూక్లిన్ క్రిమరీ ఐస్ క్రీమ్ వ్యాపారం, బాస్కిన్ రాబిన్స్ వంటి బ్రాండ్లు వీరి అధీనంలో ఉన్నాయి.
Also Read: Viral Video: 3 కొండల నడుమ క్రికెట్… కొంచెం అటు ఇటు అయినా ప్రాణం పోవాల్సిందే
ఈమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుంది. ” Mr paws pet spa & store” అనే పెట్ కేర్ బ్రాండ్ ని స్థాపించి విజయవంతంగా నడిపిస్తోంది. సానియా చందోక్ ఉన్నత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ పబ్లిక్ లో ఎక్కువగా కనిపించదు. అందుకే ఈమె గురించి తెలుసుకోవడానికి నెటిజెన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈమెకి చిన్నప్పటి నుంచే సచిన్ ఫ్యామిలీ తో సాన్నిహిత్యం ఉందని సమాచారం. ఈ క్రమంలో ఈమె సారా టెండూల్కర్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలాకాలంగా ఈమెతో అర్జున్ ప్రేమలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది. అయితే సానియా – అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థంపై టెండూల్కర్ లేదా చందోక్ కుటుంబాల నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.