BigTV English

Shreyas Iyer : ఐపీఎల్ చరిత్రలోనే అయ్యర్ సరికొత్త రికార్డు..3 జట్లకు ప్రాణం పోశాడు

Shreyas Iyer :  ఐపీఎల్ చరిత్రలోనే అయ్యర్ సరికొత్త రికార్డు..3 జట్లకు ప్రాణం పోశాడు

Shreyas Iyer : టీమిండియా క్రికెటర్, పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ది నిజంగా లక్ అనే చెప్పాలి. ముఖ్యంగా అతను ఏ టీమ్ తరపున కెప్టెన్ గా ఆడితే ఆ టీమ్ విజయాల్లో ముందు వరుసలో ఉంటుంది. ఐపీఎల్ లో పరిశీలించినట్టయితే.. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 1 ఐపీఎల్ సీజన్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సమయంలో ఢిల్లీ జట్టు ఏకంగా ఫైనల్స్ వరకు వెళ్లి ఫైనల్స్ లో ఓడిపోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ కి 2024లో కెప్టెన్ గా వ్యవరించి ఆ జట్టుకు టైటిల్ ని అందించాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. పంజాబ్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. నిన్న రెండో స్థానంలో కొనసాగగా.. రాత్రి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో మొదటి స్థానానికి ఎగబాకింది గుజరాత్ టైటాన్స్.


Also Read :  BCCI on PCB: పాకిస్థాన్ కు షాక్.. BCCI అదిరిపోయే స్కెచ్.. ఇక ఆసియా కప్ జరిగే ఛాన్స్ లేదుగా !

దాదాపు 11 సంవత్సరాల తరువాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆప్స్ కి చేరుకుంది. 2014లో పంజాబ్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఫైనల్ లో ఓడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పంజాబ్ ప్లే ఆప్స్ కి చేరుకోకపోవడం గమనార్హం. శ్రేయాస్ కెప్టెన్సీ వల్ల ఏ జట్టుకైనా కలిసి వస్తుందనే చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేయడం.. ఆటగాళ్లను ప్రోత్సహించడం ఆ జట్టు కి కలిసొచ్చే అంశం. గత ఏడాది కేకేఆర్ కి టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని అసలు ఆ జట్టు ఎందుకు వదులుకుందోనని పలువురు అభిమానులు ఆశ్యర్యపోతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మగధీర సినిమా తరహాలో శ్రేయాస్ అయ్యర్ కూడా నీకు మాట ఇస్తున్న మిత్రబిందా.. ఈ సారి పంజాబ్ దే కప్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడం విశేషం.


ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్ లు ఆడితే.. వాటిలో 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో పంజాబ్ జట్టు కి 17 పాయింట్లు వచ్చాయి. పంజాబ్ కంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో రెండో స్థానంలో కొనసాగుతోంది ఆర్సీబీ. మరోవైపు గుజరాత్ టైటాన్స్ తొలి స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది తొలుత కాస్త వెనుకంజలో పడినప్పటికీ.. పంజాబ్ మళ్లీ పుంజుకొని ప్లే ఆప్స్ రేసులోకి వచ్చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం పంజాబ్ కింగ్స్ జట్టు మొదటి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో టైటిల్ సాధించబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. నిన్న రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించడంతో ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కచ్చితంగా టైటిల్ కొడుతుందనే నమ్మకం కలిగిందని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. వాస్తవానికి పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సారి బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో కూడా రాణిస్తోంది.  ఈ సీజన్ లో ఏ జట్టు టైటిల్ సాధిస్తుందో వేచి చూడాలి.

?igsh=ejYyZnp5YWZscnRh

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×