BCCI on PCB: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… భారత క్రికెట్ నియంత్రణ మండలి చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. అడుగడుగునా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు షాక్ ఇస్తూ… ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏషియా క్రికెట్ కౌన్సిల్ కు పూర్తిగా దూరంగా ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా నిర్ణయం తీసుకుంది.
Also Read: Jyoti Malhotra: బాబర్ ఆజంతో జ్యోతి మల్హోత్రాకు లింకులు.. అ**క్రమ సంబంధం పెట్టుకుని మరీ !
ఏషియా క్రికెట్ కౌన్సిల్ కు గుడ్ బై
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… ఏషియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనబోమని కౌన్సిల్ కు సమాచారం ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ప్రస్తుతం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నక్వి ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతడు.. ప్రెసిడెంట్ గా ఉన్న నేపథ్యంలో… అందులో టీమిండియా పాల్గొనడం.. ఏమాత్రం భవ్యం కాదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే నెలలో జరిగే ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఏసియా కప్, అలాగే సెప్టెంబర్ మాసంలో జరిగే మెయిన్స్ ఏషియా కప్ లో టీమిండియా జట్లు పాల్గొనడం లేదని తెలుస్తోంది.
అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి… తీసుకున్న ఈ నిర్ణయంతో ఏసియా క్రికెట్ కౌన్సిల్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రపంచంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యంత బలమైనది. కాబట్టి ఏసియా క్రికెట్ కౌన్సిల్ లో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉంటేనే బలం. అదే భారత క్రికెట్ నియంత్రణ మండలి అందులో నుంచి వైదొలిగితే మిగతా జట్లు కూడా బయటకు వెళ్లే ఛాన్సులు ఉంటాయి. అప్పుడు పాకిస్తాన్ ఒంటరి అవుతుంది.
ట్రై సిరీస్ కోసం బీసీసీఐ ప్లానింగ్
ఆసియా కప్ కు దూరమవుతున్న టీమిండియా జట్టుతో భారీ ప్లాన్ చేస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆసియా కప్ స్థానంలో పెద్ద ట్రై సిరీస్ నిర్వహించాలని అనుకుంటున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, టీమిండియా మధ్య ట్రై సిరీస్ నిర్వహించేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే…. ఆసియా కప్ ఎవరు చూసే ఛాన్స్ ఉండదు. వ్యూయర్షిప్ మొత్తం ఈ ట్రై సిరీస్ వైపు…వెళుతుంది. అందుకే… భారత క్రికెట్ నియంత్రణ మండలి… పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ ప్లాన్ నిజంగా అప్లై అయితే… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు గట్టి షాక్ తగులుతుంది.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
BCCI has informed the Asian Cricket Council of its decision to withdraw from the upcoming Women’s Emerging Teams Asia Cup and the Men’s Asia Cup that are scheduled to take place later this year.#Cricket #India #Sportskeeda pic.twitter.com/5m4EtaqIVc
— Sportskeeda (@Sportskeeda) May 19, 2025