BigTV English

Shubman Gill Vs Jonny Bairstow: గిల్ ని గిల్లిన బెయిర్ స్టో.. మధ్యలో సర్ఫరాజ్ ఎంట్రీ

Shubman Gill Vs Jonny Bairstow: గిల్ ని గిల్లిన బెయిర్ స్టో.. మధ్యలో సర్ఫరాజ్ ఎంట్రీ
Fight Between Gill, Jonny Bairstow and Sarfaraz
Fight Between Gill, Jonny Bairstow and Sarfaraz

ఇందులోకి పానకంలో పుడకలా, పెద్ద మొనగాడిలా సర్ఫరాజ్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో వ్యవహారం ముదిరిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారింది.

రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను బజ్ బాల్ ఆటతీరుతో చాలా స్పీడుగా ఆడుతున్నాడు. ఈ దశలో ఓవర్ మారే గ్యాప్ లో  శుభ్ మన్ గిల్‌తో వాగ్వాదానికి దిగాడు. బెయిర్‌స్టో మొదట గిల్‌ని వెటకారపు మాటలతో ఆటపట్టించాడు. జేమ్స్ ఆండర్సన్‌ను తక్కువ అంచనా వేశావా? అందుకనే అవుట్ అయిపోయావా? అన్నాడు. ఇటీవల ఎక్కువ సార్లు ఆండర్సన్ బౌలింగ్ లోనే
గిల్ అవుట్ కావడం విశేషం. ఆ ఉద్దేశంతోనే అలా అన్నాడు.


Read More: నూరో టెస్టులో చరిత్ర స్రష్టించిన అశ్విన్..

అయితే గిల్ పైకి అలా మెత్తగా ఉంటాడు కానీ, తనకి కోపం ఎక్కువే. వెంటనే రియాక్ట్ అయి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నేనేమీ డకౌట్ కాలేదు, సెంచరీ చేశాను. ఆ తర్వాత నన్ను అవుట్ చేశాడు, మీరిక్కడ ఎన్ని సెంచరీలు సాధించారంటూ ఘాటుగా తగిలించాడు.

ఇలా బెయిర్‌స్టో, శుభ్‌మన్ మధ్య వాగ్వాదం జరుగుతుండగా, పానకంలో పుడకలా  సర్ఫరాజ్ ఖాన్ వీరి మధ్యలోకి వచ్చాడు.  చేసింది కొన్ని పరుగులే కదా.. ఈ మాత్రం దానికే ఎగిరి ఎగిరి పడుతున్నావ్ అంటూ తన రేంజ్ లో గట్టిగానే ఇచ్చాడు. ఈ వాగ్వాదం తర్వాత  కుల్దీప్ బౌలింగ్‌లో 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెయిర్ స్టో అవుట్ అయ్యాడు. దీంతో మౌనంగా బెయిర్ స్టో పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×