BigTV English

Sai Pallavi: పబ్‌లో సాయి పల్లవి.. మాస్ స్టెప్పులతో ఇరగదీసేసింది.. వీడియో వైరల్!

Sai Pallavi: పబ్‌లో సాయి పల్లవి.. మాస్ స్టెప్పులతో ఇరగదీసేసింది.. వీడియో వైరల్!


Sai Pallavi: సినిమాలలో ఎలాంటి పాత్రని అయినా అలవోకగా చేయగలిగే హీరోయిన్ సాయిపల్లవి. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇక తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నిజంగానే తన అందం, నటన, డ్యాన్స్‌తో అందరినీ ఫిదా చేసింది.

ఆ తర్వాత కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది. ఆమె మాటలకే కాదు.. డ్యాన్స్‌కు కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. సాయి పల్లవి చిందేసిందంటే ఆ వీడియో వైరల్ కావాల్సిందే. అది సినిమాలో అయినా.. పెళ్లిలో అయినా.. మరే ఇతర ఫంక్షన్, పార్టీలో అయినా. ఆమె కాలు కదిపిందంటే వేలల్లో వ్యూస్ రావాల్సిందే.


ఆమె డ్యాన్స్‌కు అంతటి క్రేజ్ ఉంది మరి. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ముఖ్యంగా తన మాస్ డ్యాన్స్‌తో ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇక అలాంటి సాయి పల్లవి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

READ MORE: అమీర్ ఖాన్ కొడుకుతో సాయి పల్లవి.. వైరల్ అవుతున్న ఫొటోలు!

సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ నుంచి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో ఓ మూవీ చేస్తోంది. ఈ మూవీతోనే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జపాన్‌లో జరుగుతోంది. అయితే అక్కడ షూటింగ్‌కి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. అందులో సాయి పల్లవి, జునైద్ ఖాన్ కలిసి ఉన్న ఫొటోలు చూశాం.

ఇక ఇప్పుడు మరో వీడియో వైరల్‌గా మారింది. తాజాగా ఈ మూవీ యూనిట్ మొత్తం కలిసి అక్కడ ఒక పబ్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మూవీ యూనిట్‌తో కలిసి సాయి పల్లవి ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్‌‌ స్టెప్పులతో అదరగొట్టేసింది. పలు హిందీ సాంగ్స్‌కి ఆమె స్టెప్పులు వేసింది.

ఇక ఆమె డ్యాన్స్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ మూవీ జపాన్ షెడ్యూల్ తాజాగా పూర్తయిందని తెలుస్తోంది. ఈ కారణం వల్లనే మూవీ యూనిట్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతోందని టాక్. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×