BigTV English
Advertisement

The Goat Life: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ట్రైలర్..

The Goat Life: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ట్రైలర్..
Pruthvi Raj Sukumaran's Adu jeevitham movie Trailer
Pruthvi Raj Sukumaran’s Adu jeevitham movie Trailer

The Goat Life: స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. తెలుగులోనూ పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అంతేకాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.


ఇక ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. అయితే ఒక్క తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

అయితే ఇటీవల ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించి మెప్పించాడు. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.


అయితే ఈ మూవీతో మంచి మార్కులు కొట్టేసిని పృథ్వీరాజ్‌.. ఈ సారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసిందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా ఇప్పుడు ‘ది గోట్ లైఫ్’(ఆడు జీవితం) అనే సినిమా చేస్తున్నాడు.

READ MORE: ఓటీటీలో 96వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసి సర్ప్రైజ్ అందించారు.

పాన్‌ ఇండియా స్థాయిలో మలయాళం, తెలుగు, హిదీ, తమిళం, కన్నడ వంటి భాషల్లో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇక ఈ అన్ని భాషల్లో ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చాలా అద్భతంగా ఉంది. ప్రతి ఒక్కరినీ ఇది ఆకట్టుకుంటోంది.

అదిరిపోయే టేకింగ్‌తో సినీ ప్రేక్షకుల్ని ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ‘ది గోట్ లైఫ్’ ట్రైలర్ ఉంది. ఇక ఈ ట్రైలర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ రకరకాల గెటప్స్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఎడారి లొకేషన్స్, విజువల్స్ , హీరో క్యారెక్టర్‌ను ఎంతో అద్భుతంగా చూపించారు.

డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రాన్ని బెన్యామిస్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ మూవీ అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ మూవీ విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది.

READ MORE: ఓటీటీ కంటే ముందే టీవీలోకి ‘హనుమాన్’.. కన్ఫర్మ్ చేసిన ప్రశాంత్ వర్మ.. ఏ ఛానల్‌లో తెలుసా

ఇక ఈ మూవీ దర్శకుడు డైరెక్టర్ బ్లెస్సీ ట్రైలర్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా లాంటి గొప్ప సర్వైవల్ అడ్వెంచర్ సినిమా ఇప్పటివరకు వెండితెరపై రాలేదని అన్నాడు.

ఇలాంటి ఘటనలు ఒక వ్యక్తి జీవితంలో జరుగుతాయా అని మూవీ చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు. మూవీ చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

కాగా ఈ సినిమా టేకింగ్ కోసం వారు దాదాపు పదేళ్లు సమయం తీసుకున్నట్లు తెలిపాడు. అలాగే హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. ఈ మూవీ యూనిట్ మొత్తం ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని అన్నాడు.

దాదాపు 10 ఏళ్ల తమ శ్రమ తర్వాత ఇప్పుడు తమ సినిమాను ప్రేక్షకులు తెరపై చూడబోతున్నారనే సంతోషం ఎక్కువగా ఉందని చెప్పాడు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×