BigTV English

Shubman Gill: సవాల్ కి సిద్ధం.. అపోజిషన్ టీమ్స్ కి గిల్ మాస్ వార్నింగ్

Shubman Gill: సవాల్ కి సిద్ధం.. అపోజిషన్ టీమ్స్ కి గిల్ మాస్ వార్నింగ్

Shubman Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ పై పెద్దగా ఆశలు లేవు. కెప్టెన్ శుబ్ మన్ గిల్, జోస్ బట్లర్ లాంటి ఇద్దరు, ముగ్గురు తప్పితే.. ఈ స్క్వాడ్ లో పెద్ద బ్యాటర్లెవరూ లేరు. బౌలింగ్ విభాగంలో కూడా మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ తప్పితే పేరున్న స్టార్లు లేరు. దీంతో ఈ జట్టు ప్లే ఆఫ్స్ కూడా చేరడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ గుజరాత్ జట్టు మ్యాచ్ మ్యాచ్ కి మెరుగుపడుతూ.. గెలుపు జోరును కొనసాగిస్తుంది.


Also Read: Ambati Rayudu- Dhoni: అంబటి రాయుడు సంచలనం.. అతనే నా ఫ్యాన్ అంటూ కామెంట్స్

ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో.. కేవలం ఒక మ్యాచ్ లోనే ఓడి, నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం రోజు అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 58 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాయి సుదర్శన్ 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.


బట్లర్ 36, షారుక్ ఖాన్ 36 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేదనలో రాజస్థాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. హిట్ మేయర్ 52, సంజు శాంసన్ 41 పరుగులు చేసినప్పటికీ.. వీరి శ్రమ వృధా అయ్యింది. ఓపెనర్ సుదర్శన్ ఆఫ్ సెంచరీ తో జట్టును ముందుండి నడిపించడంతో.. గుజరాత్ భారీ స్కోరు చేయగలిగింది. అయితే రాజస్థాన్ రాయల్స్ పై విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అపోజిషన్ టీమ్స్ కి ఏకంగా వార్నింగ్ ఇచ్చాడు గిల్. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. ” మేము మంచి టార్గెట్ సెట్ చేశాం. మొదటి మూడు, నాలుగు ఓవర్లలో బ్యాటింగ్ చేయడం కష్టమైంది. సాయి సుదర్శన్, బట్లర్ ఆడిన తీరు అద్భుతం. ప్రత్యర్ధుల నుండి ఎంతటి సవాల్ కైనా సిద్ధం. ఏరోజైనా సరే 220 బాధేయడానికి మేము సిద్ధం. మా దగ్గర అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు.

మేము బాగా బ్యాటింగ్ చేస్తే చాలు. మిగతా కథ వాళ్ళు ముగిస్తారు” అంటూ అపోజిషన్ టీమ్స్ కి వార్నింగ్ ఇచ్చాడు గిల్. అయితే గిల్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. అతివిశ్వాసం మంచిది కాదని గిల్ కి సూచిస్తున్నారు.

 

ఇలా 300 టార్గెట్ తో బరిలోకి దిగి సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములను చవిచూస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ లో ఓటమి అనంతరం సంజు మాట్లాడుతూ.. ” మేము బౌలింగ్ లో రాణించలేకపోయాం. మా జట్టు ఓటమికి అదే కారణం. బౌలింగ్ లో ఓ 20 పరుగులు అదనంగా ఇచ్చాం. అదే సమయంలో బ్యాటింగ్ లోను విఫలమయ్యాం” అని చెప్పుకొచ్చాడు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×