Ms Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని నియామకమయ్యాడు. కాసేపటి క్రితమే ఈ విషయాన్ని చెన్నై మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటన చేసింది. ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజు గైక్వాడ్… టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. చెన్నై ప్రస్తుత కెప్టెన్ రుతురాజు గైక్వాడ్ మోచేతికి గాయమైనట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువ అయిన నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. అయితే రుతురాజు గైక్వాడ్ మధ్యలోనే వైదొలగడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుగా మహేంద్రసింగ్ ధోని ఎంపికయ్యాడు. దీంతో ఇకపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) నాయకత్వంలోనే ఆడనుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings Fans ) అభిమానులు.. సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: Ambati Rayudu- Dhoni: అంబటి రాయుడు సంచలనం.. అతనే నా ఫ్యాన్ అంటూ కామెంట్స్
అప్పుడు జడేజా ఇప్పుడు రుతురాజు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… మరోసారి మహేంద్ర సింగ్ ధోనీకి అద్భుతమైన అవకాశం వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా… మహేంద్ర సింగ్ ధోని మరోసారి బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వైదొలగడంతో ఈ అవకాశం వచ్చింది. అయితే గతంలో కూడా… మహేంద్ర సింగ్ ధోని కి ఇలాంటి అవకాశాలు రావడం చూసాం. 2022 ఐపీఎల్ టోర్నమెంట్ సమయంలో ( Indian Premier League 2022 Tournament )… మహేంద్ర సింగ్ ధోనీని పక్కకు పెట్టి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు ( Ravidra jadeja )కెప్టెన్సీ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.
అయితే… ధోని సూచనల మేరకు కొన్ని మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు రవీంద్ర జడేజా. కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం అత్యంత దారుణంగా విఫలమైంది. దీంతో.. వెంటనే రవీంద్ర జడే జాను తప్పించి కొత్త కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని మరోసారి నియామకం చేసింది చెన్నై యాజమాన్యం. ఆ తర్వాత మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు బాట పట్టింది. అయితే సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అలాంటి సంఘటనే తెరపైకి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad ) స్థానంలో మళ్లీ మహేంద్ర సింగ్ ధోనీకి అవకాశం వచ్చింది. రుతురాజు గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచింది. ఒక్క మ్యాచ్ గెలిచిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్… వరుసగా ఓటమిపాలైంది. ఇలాంటి నేపథ్యం లోనే గాయం కారణంగా రుతురాజు గైక్వాడ్ ( Ruturaj Gaikwad ) వైదొలిగాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోని కి ఛాన్స్ వచ్చింది.
Also Read: Soft Drink Cost – IPL 2025: ఐపీఎల్ పేరుతో స్టేడియాలలో దోపిడీ.. ఒక్కో కూల్ డ్రింక్ ధర ఎంత అంటే?
🚨 BREAKING: Ruturaj Gaikwad has been ruled out of the IPL due to an elbow fracture
MS Dhoni will captain CSK for the rest of the IPL…#IPL2025 #MSDhoni #CSK #IPL pic.twitter.com/BCTmFySQ0r
— Cricbuzz (@cricbuzz) April 10, 2025