BigTV English

Mohammed Siraj : కొత్త అమ్మాయితో మహమ్మద్ సిరాజ్.. లండన్ లో ఎంజాయ్ చేస్తున్నాడుగా !

Mohammed Siraj : కొత్త అమ్మాయితో మహమ్మద్ సిరాజ్.. లండన్ లో ఎంజాయ్  చేస్తున్నాడుగా !

Mohammed Siraj : టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. భారత బౌలర్లలో హైదరాబాద్ కి చెందిన సిరాజ్ ఒకరు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే  పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ డియోగో జోటా యాక్సిడెంట్ లో ఇటీవలే మరణించాడు. ఆ విషయం తెలిసి షాక్ కి గురయ్యాయనని తెలిపారు సిరాజ్. అలాగే అతని మరణం తనను కలచివేసిందని.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో వికెట్ తీయగానే అతనికి అంకితం చేశానని చెప్పుకొచ్చాడు. డియోగో జోటాకి మృతికి నివాళులర్పించారు సిరాజ్. ఇదిలా ఉంటే.. తాజాగా సిరాజ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. 


Also Read : IND vs ENG: ఇంగ్లాండ్ బ్యాటర్ల ఇజ్జత్ తీసిన గిల్… పిసుక్కోండి అంటూ !

అందుకే సిరాజ్ ని కలిసిందా..?


తాజాగా సిరాజ్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. ఇటీవల లండన్ లో యువరాజ్ సింగ్ లండన్ లో ఇచ్చిన పార్టీలో ఓ కొత్త అమ్మాయితో కనిపించాడు మహమ్మద్ సిరాజ్. దీంతో సిరాజ్ మరెవ్వరో కొత్త అమ్మాయితో తిరుగుతున్నాడని.. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొట్టాయి. ఆ అమ్మాయి మరెవ్వరో కాదండోయ్.. ప్రముఖ నిర్మాత, FAB ఎంటర్టైన్ మెంట్ సీఈవో ఫౌజియా అంజుమ్ వోహ్రా. వాస్తవానికి ఈమె యువరాజ్ సింగ్ లండన్ లో ఇచ్చిన పార్టీకి హాజరయ్యారు. పలువురు క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో కలిసి ఫోటోలు దిగింది. వీరిలో ముఖ్యంగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్ ఇలా చాలా మందితో ఫొటో దిగింది. కానీ ఏ ఫొటోలు అంతగా వైరల్ కాలేదని.. వీరిద్దరూ ముస్లింలు కావడం వల్లనో ఏమో కానీ.. సిరాజ్ తో కలిసి ఫౌజియా అంజుమ్ వోహ్రా ని సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ కావడం విశేషం.

లండన్ లో..

సిరాజ్ మరో కొత్త అమ్మాయితో కలిసి లండన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. అందులో సిరాజ్ 2 వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్ లో సిరాజ్ బౌలింగ్ లో టీమిండియా ఆటగాళ్లు కే.ఎల్. రాహుల్, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లు క్యాచ్ లు మిస్ చేయడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోర్ చేసింది. లేకుంటే ఇంకా తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయ్యేది. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఫీల్డర్ల మిస్టేక్స్ వల్ల కేవలం 2 వికెట్లు మాత్రమే పడ్డాయి. జెమీ స్మిత్ 51, బ్రైడన్ కార్స్ 56 పరుగులు చేసిన వీరిని పెవీలియన్ కి చేర్చాడు. ముఖ్యంగా కార్స్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు సిరాజ్. మరోవైపు టీమిండియా కూడా 387 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. నిన్న ఆట ముగిసే సమయానికి 2 పరుగులు చేసింది.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×