IND VS PAK: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia Cup 2025 tournament ) భాగంగా… రేపటి రోజున అంటే మరికొన్ని గంటల్లోనే… బీకర్ ఫైట్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan ) మధ్య మ్యాచ్ జరగనుంది. రేపు రాత్రి జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు… విక్రయించబడలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో… టీమిండియా కు ఎదురు దెబ్బ తగిలింది. రేపు మ్యాచ్ ఉండగా టీమిండియా వయసు కెప్టెన్ గిల్ కు ( Shubman Gill ) తీవ్ర గాయం అయింది. ఇవాళ ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా ఓపెనర్ గిల్ తీవ్రంగా గాయపడ్డాడని ఓ వీడియో బయటకు వచ్చింది. బంతి తన చేతి వేళ్లకు బలంగా తాకడంతో గిల్ నొప్పితో విలవిలలాడిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read: Asia Cup 2025 : ఆసియా కప్ లో టీమిండియా కు ఎదురు దెబ్బ.. దుబాయ్ నుంచి వచ్చేసిన వాషింగ్టన్ సుందర్
వెంటనే ఫిజియో వచ్చి ఆయనను బయటకు తీసుకువెళ్లడం జరిగింది. అయితే రేపు మ్యాచ్ ఉండగా గిల్ కు ( Shubman Gill Injury) చిన్నపాటి గాయం కావడంతో అందరూ టెన్షన్ పడుతున్నారు. ఈ గాయం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ శుభమన్ గిల్ తాకిన గాయం తీవ్ర తరం అవుతే…మాత్రం మ్యాచ్ ఆటడం కష్టమే. లేకపోతే…అతను రేపు ఫిట్ గా ఉంటే… కచ్చితంగా పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తాడు.
ఇది ఇలా ఉండగా… ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… రేపటి రోజున టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. రేపు రాత్రి 8 గంటల సమయంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. సోనీ లివ్, స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ లు తిలకించవచ్చును. ఇప్పటికే పాకిస్థాన్, టీమిండియా చిన్న జట్లపై చెరో మ్యాచ్ గెలిచి ఉన్నాయి.
టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో గిల్ కు గాయం అయింది. ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో టీమిండియా ఓపెనర్, వైస్ కెప్టెన్ గిల్ తీవ్ర మైన గాయం అయిందని అంటున్నారు. అయితే.. రేపు గిల్ ఫిట్ గా లేక పాకిస్థాన్ తో మ్యాచ్ కు దూరం అవుతే.. పరిస్థితి వేరేలా ఉంటుంది. అప్పుడు సంజూ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వస్తారు. జితేష్ శర్మ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. జితేష్ శర్మ కీపర్ గా అలాగే.. ఫినీషర్ గా పనికివస్తాడు. అంటే గిల్ స్థానాన్ని సరిగ్గా భర్తీ చేస్తాడని జితేష్ ను తీసుకునే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి.
Big concern for Team India ahead of #AsiaCup2025 clash vs Pakistan🚨#ShubmanGill was struck on the hand during practice in Dubai and looked in visible pain.
Will he recover in time for the high-pressure game❓
Stay tuned for the latest updates🟢 pic.twitter.com/xU6MovUWWH
— TOI Sports (@toisports) September 13, 2025