Singapore Open 2024: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ దృష్టి ఇప్పుడు సింగపూర్ ఓపెన్‌పై పడింది. మరో రెండునెలల్లో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న టోర్నీ ఇదే. దీంతో భారత ఆటగాళ్లకు సత్తా చాటేందుకు చక్కని అవకాశం లభించింది.
మంగళవారం నుంచి టోర్నీ ప్రారంభమైంది. బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, ప్రణయ్, లక్ష్యసేన్ టైటిల్‌పై ఫోకస్ పెట్టారు. ఇటీవల మలేషియా మాస్టర్స్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సింధు, ఎలా రాణిస్తుందో చూడాలి. ఈ క్రమంలో ఆమె మరోసారి అడుగు ముందుకేస్తుందా..? సింగపూర్ టైటిల్‌ను సొంతం చేసుకుంటుందా..? అనేది చూడాలి.
ప్రస్తుత టోర్నీలో డెన్మార్క్‌కు చెందిన హూజ్‌మార్క్‌తో సింధు తలపడుతోంది. ఇక పురుషుల సింగిల్స్ విషయానికొస్తే.. లక్ష్యసేన్‌కు ఆదిలోనే గట్టిపోటీ ఎదురుకానుంది. ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు అక్సెల్‌సెన్‌తో తలపడనున్నాడు. ఇక మరో ఆటగాడు ప్రణయ్.. థాయ్‌లాండ్‌కు చెందిన లువాంగ్‌తో మొదలుపెట్టనున్నాడు.
Also Read: ఐపీఎల్ ముగిసింది.. టీ 20 ప్రపంచకప్ జోష్ మొదలు
ఇక డబుల్స్‌లో ఫేవరేట్స్‌గా బరిలోకి స్వాతిక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు డెన్మార్క్ ఆటగాళ్లతో పోరుకు సిద్ధమయ్యారు. వీరుకాకుండా కిదాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్; ఆకర్షి కశ్యప్, అశ్వినిపొన్నప్ప- తనీషా క్రాస్టో, పుల్లెల గాయత్రి-ట్రీసా జోలీ కూడా తమతమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.