Rohit Sharma – Virat: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) నేపథ్యంలో… ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా… పరుగులు చేసేందుకు చాలా కష్టపడుతోంది. అటు ఆస్ట్రేలియాను కట్టడి చేసేందుకు టీమిండియా ఆటగాళ్లు కూడా ఎంతో కష్టపడుతున్నారు. ప్రస్తుత సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 190 కి పైగా పరుగులు చేసింది. అయితే… ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… ఆసక్తికర సంఘటన జరిగింది. టీమిండియా డేంజర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యారు. బౌలింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ ను బండ బూతులు తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: harbhajan singh: క్రికెట్ అంటే తెలియని వాళ్ళు ఇలా మాట్లాడటం విడ్డూరం
విరాట్ కోహ్లీ విసిరిన బంతిని.. బౌలింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్.. వికెట్ల దగ్గర ఉండి.. వదిలేశాడు. దీంతో బంతి… రోహిత్ శర్మ దగ్గరికి వెళ్ళింది. అయితే కుల్దీప్ యాదవ్ బంతిని వదిలేయడం పైన విరాట్ కోహ్లీ తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు కళ్ళు దొబ్బాయా..? బంతి కనిపించడం లేదా..? నిద్రపోతున్నావా అంటూ ఇద్దరూ కూడా కుల్దీప్ యాదవ్ను గట్టిగానే తగులుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఆది నుంచి వికెట్లను కోల్పోతూనే ఉంది. ఎంతో భయంకరంగా బ్యాటింగ్ చేస్తాడు అనుకున్న…. ట్రావిస్ హెడ్ 33 బంతుల్లో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు కూడా ఉన్నాయి. అయితే వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ బౌలింగ్ లో గిల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అలాగే మరో ఆస్ట్రేలియా ఓపెనర్… కూపర్… షమీ ( Shami ) బౌలింగ్ లో డక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్.. హాఫ్ సెంచరీ పూర్తి చే సుకున్నాడు. సెంచరీ వీరుడు జోష్ ఇంగ్లీష్.. 11 పరుగులు చేయగా లబుషంగే 29 పరుగులు చేసే ఔట్ అయ్యాడు. ఇక ఇవాల్టి మ్యాచ్ లో గెలిచిన జట్టు… మార్చి 9వ తేదీన ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అలా కాదని… ఆస్ట్రేలియా గెలిస్తే లాహోర్ ఆడాల్సి ఉంటుంది. ఇక రేపు పాకిస్తాన్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో గెలిచిన జట్టు.. ఇవాళ గెలిచిన జట్టుతో ఆడనుంది.
Also Read: IND VS AUS: బ్యాటింగ్ చేయనున్న ఆసీస్…4 గురు స్పిన్నర్లతో టీమిండియా దాడి ?
Getting cooked by Rohit Kohli both😭🙏pic.twitter.com/7IKWQSPLmO
— Pushkar (@Musafirr_hu_yar) March 4, 2025