APPSC: నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏమిటి? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంత మంది నిరుద్యోగులకు మేలు చేకూరుతుందో తెలుసుకుందాం.
ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి విజయాన్ని అందుకుంది. ఎన్నడూ లేని రీతిలో కూటమికి పట్టభద్రులు జై కొట్టారని చెప్పవచ్చు. అందుకే వారికి మేలు చేకూర్చేలా ప్రభుత్వం, ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని ఎందరో నిరుద్యోగులకు మేలు చేకూరనుంది.
ఇక అసలు విషయం లోకి వెళితే.. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీసెస్ రెండేళ్లు.. నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు 34 నుండి 42 ఏళ్లకు వయోపరిమితి పెంచింది. నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కి ఏకంగా 8 ఏళ్ల వయోపరిమితి పెంచడం విశేషం. అంతేకాదు ఏపీపీఎస్సీ తో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్టర్ రిక్రూట్మెంట్ పోస్టులకు దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం మరో విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీలోగా జరిగే పరీక్షలకు ఈ నిబంధన వర్తించనుంది.
దేశ చరిత్రలో 8 ఏళ్లు వయోపరిమితి పెంచడం ఇదే తొలిసారిగా అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఏపీపీఎస్సీ ఉద్యోగం అనేది ప్రతి నిరుద్యోగుని కల. అయితే వయోపరిమితి దాటిందన్న అభిప్రాయంతో ఎందరో నిరుద్యోగులు ఈ ప్రకటన కోసం ఎదురుచూపుల్లో ఉన్నారు. 2017 నుండి ఏపీలో నిరుద్యోగులు ఈ డిమాండ్ వినిపిస్తున్నారు. ఆ సమయంలో అధికారంలో గల టీడీపీ రెండేళ్ళు వయోపరిమితి పెంచింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగులు, ఈ సమస్యను తీసుకెళ్లినా ఏ మాత్రం స్పందించలేదని నిరుద్యోగులు తెలుపుతున్నారు.
Also Read: AP DSC notification: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించిన సమయంలో నిరుద్యోగులు సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం రాగానే సమస్యను పరిష్కారిస్తామని నాడు లోకేష్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనితో రాష్ట్రంలోని 40 లక్షల మంది యువతకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నారు. ప్రధానంగా ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులు మాత్రం తమకు దక్కిన చక్కని అవకాశంగా అభివర్ణిస్తున్నారు.