Smriti Mandhana-Palash: టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్, వైస్ కెప్టెన్ స్మృతి మందాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. వీరి వివాహం ఈనెల 23వ తేదీన జరగాల్సి ఉండగా.. స్మృతి తండ్రి శ్రీనివాస్ గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో వివాహం వాయిదా పడింది. ఆ తర్వాత పలాశ్ కూడా ఒత్తిడి కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. ఆ తర్వాత అట్టహాసంగా జరిగిన వీరి మెహందీ, సంగీత్ లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు.
Also Read: Temba Bavuma: గిల్ కంటే KL రాహుల్ బెటర్… ఇజ్జత్ తీసిన టెంబా బావుమా
అలాగే పలాశ్ తో ఎంగేజ్మెంట్ ని దృవీకరిస్తూ.. ఎంగేజ్మెంట్ రింగ్ ని చూపిస్తూ స్మృతి మందాన పోస్ట్ చేసిన వీడియోను కూడా డిలీట్ చేశారు. ఇదే వీడియోను ఆమె స్నేహితులు, తోటి క్రీడాకారీలు కూడా వారి ఖాతాల నుంచి తొలగించడంతో.. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా పలాశ్ కి మరో మహిళతో సంబంధం ఉందనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. దీంతో వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ తతంగం అంతా ముగిసిన తర్వాత స్మృతి తండ్రి శ్రీనివాస్, అటు పలాశ్ కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
తన పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని వస్తున్న వార్తలకు స్మృతి మందాన తాజాగా చెక్ పెట్టింది. ఆ రూమర్స్ ప్రచారాన్ని పూర్తిగా ఖండించింది. ఇప్పటివరకు వైరల్ గా మారిన రూమర్స్ కి స్మృతి మందాన దిష్టి రక్ష ఎమోజితో చెక్ పెట్టింది. స్మృతి – పలాస్ దిష్టి రక్ష ఎమోజితో ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు. వీరిద్దరూ తాజాగా తమ ఇంస్టాగ్రామ్ బయోలో దిష్టి రక్ష ఎమోజి ని చేర్చుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఎటువంటి సమస్యలు లేవనే విషయం అందరికీ స్పష్టంగా తెలిసింది. ఇక శుక్రవారం రోజు పలాశ్ తల్లి అమితా కూడా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. ప్రస్తుతం అంతా బాగానే ఉందని, త్వరలోనే వీరి వివాహం జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం స్మృతి – పలాష్ ఇద్దరు కష్టాలలో ఉన్నారని.. స్మృతిని.. తన అర్ధాంగిగా తమ ఇంటికి తీసుకురావాలని పలాశ్ కలలు కన్నాడని, తాను కూడా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నానని స్పష్టం చేసింది. అలాగే వీరి వివాహం అతి త్వరలోనే జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. దీంతో వీరిద్దరి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
స్మృతి మందాన – పలాశ్ ముచ్చల్ తమ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒకే రకమైన పోస్ట్ పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వీరి వివాహంపై అనేక సందేహాలు నెలకొన్నవేళ.. వీరిద్దరూ వారి ఇంస్టాగ్రామ్ బయోలో ఒకే రకమైన ఎమోజిని పంచుకోవడం గమనార్హం. సాధారణంగా ఎటువంటి శుభకార్యానికి సంబంధించిన సమాచారాన్ని ఐనా పంచుకునేటప్పుడు దిష్టి తలగకుండా ఈ ఎమోజీని ఉపయోగిస్తుంటారు.
Also Read: MS Dhoni: పెళ్లంటే సర్గం కాదు నరకమే… ధోని సంచలన వ్యాఖ్యలు
ఈ క్రమంలో స్మృతి మందాన – పలాశ్ ఈ ఎమోజిని పోస్ట్ చేయడంతో.. వీరి పెళ్లికి దిష్టి తగిలిందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ తో ఇప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రూమర్స్ కి ఒక్కసారిగా చెక్ పెట్టారని వాళ్ల అభిమానులు భావిస్తున్నారు. అలాగే త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగాలని కామెంట్స్ చేస్తున్నారు.