Sophie Shine – Dhawan: టీమిండియా ( Team India) మాజీ స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) అదిరిపోయే శుభవార్త చెప్పాడు. దాదాపు మూడు సంవత్సరాలుగా ఒంటరి జీవితం గడుపుతున్న శిఖర్ ధావన్… త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సోఫీ షైన్ అనే విదేశీ అమ్మాయితో శిఖర్ ధావన్.. చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ( 2025 Champions Trophy ) దుబాయిలో ( Dubai) జరిగినప్పటి నుంచి… ఇప్పటివరకు ఆ అమ్మాయితో శిఖర్ ధావన్ తిరుగుతూనే కనిపించాడు. ముఖ్యంగా ఎయిర్ పోర్టులలో… విమానం దిగి బయటికి వస్తున్న వీడియోలు చాలాసార్లు వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ కొనసాగుతోందని అందరూ ప్రచారం జోరుగా సాగించారు. త్వరలోనే పెళ్లి ( MArriage) చేసుకోబోతున్నారని కూడా… జోరుగా ప్రచారం సాగింది.
ప్రియురాలితో శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్
తన ప్రియురాలు సోఫి షైన్ ను (Sophie Shine ) శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమెకు సోషల్ మీడియా వేదికగా శిఖర్ ధావన్ పోస్ట్ కూడా పెట్టాడు. తమ రిలేషన్షిప్ ను అధికారికంగానే అనౌన్స్ చేశాడు శిఖర్ ధావన్. తన ప్రియురాలు సోఫీ షైన్ ను వెనుక నుంచి పట్టుకొని.. చాలా రొమాంటిక్ గా ఫోటో దిగాడు శిఖర్ ధావన్ ( Shikhar Dhawan). ఈ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి.. తమ రిలేషన్ షిప్ ను ( Relationship ) కన్ఫామ్ చేశాడు శిఖర్ ధావన్. ఇక ఈ పోస్టు సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీంతో సోఫీ షైన్ అలాగే శిఖర్ ధావన్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ ( Engegment ) చేసుకున్నారని కామెంట్స్ కూడా పెడుతున్నారు కొంతమంది క్రికెట్ అభిమానులు. అందుకే ఇద్దరు.. అలా క్లోజ్ గా దిగి ఫోటోలు షేర్ చేశారని అంటున్నారు.
లివింగ్ స్టన్ చెల్లెలు తో రిలేషన్
ఇంగ్లాండ్ ఆటగాడు లివింగ్టన్ ( Liam Livingstone ) చెల్లెలు సోఫీ షైన్ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది జోరుగా ప్రచారం చేస్తున్నారు. సోఫీ షైన్ అలాగే లివింగ్టన్ ఇద్దరి ముఖాలు సేమ్ టు సేమ్ ఉండటంతో… వాళ్ళిద్దరూ సోదరి, సోదరుడు అని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇందులో వాస్తవం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ కొంతమంది లివింగ్ స్టన్ చెల్లెలితో శిఖర్ ధవన్ రిలేషన్ పెట్టుకున్నాడని… పోస్టులు వైరల్ అయ్యాయి. దీనికి తగ్గట్టుగానే తాజాగా సోఫిష్ షైన్ తో లవ్ సింబల్… పెట్టి మరి ఓ పోస్టు సోషల్ మీడియాలో పెట్టాడు ధావన్ ( Dhawan). కాగా ఇప్పటికే శిఖర్ ధావన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: SRH Team Maldives trip : కలసి ఉంటే కలదు సుఖం… తెలుగు హీరో అయిపోయిన ప్యాట్ కమిన్స్