SRH Team Maldives trip : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ప్లే ఆప్స్ కి చేరాలంటే జరుగబోయే ప్రతీ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తేనే ప్లే ఆప్స్ కి అవకాశాలు ఉంటాయి. అయితే చెన్నై తో జరిగిన మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి అక్కడి నుంచి నేరుగా కావ్య పాప బంపర్ ఆఫర్ ఇవ్వడంతో మాల్దీవ్స్ కి వెళ్లారు. అయితే సన్ రైజర్స్ ఆటగాళ్లలో కేవలం ఒక్క నితీష్ కుమార్ వెళ్లలేదు. కానీ మిగతా ఆటగాళ్లు అంతా మాల్దీవ్స్ కి వెళ్లి తెగ ఎంజాయ్ చేశారు. అందుకే దీనిపై ప్రస్తుతం ట్రోలింగ్స్ చేస్తున్నారు. అయితే విక్టరీ వెంకటేష్ లాగా హీరో అయ్యాడని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ పై ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read : Allu Family – NKR: నితీష్ కుమార్ తో అల్లు అర్జున్ ఫ్యామిలీ..మీరు రెడ్డి మేము రెడ్డినే
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన కలిసుందాంరా.. మూవీ మాదిరిగానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అంతా కలిసి మాల్దీవులకు వెళ్లారని.. కెప్టెన్ కమిన్స్ ని హీరో వెంకటేష్ తో పోల్చుతున్నారు. మరోవైపు నిర్మాత కావ్యమారన్, దర్శకత్వం డేనియల్ వెట్టోరి, హీరో పాట్ కమిన్స్ అని సోషల్ మీడియాలో ఓ పోస్టర్ కూడా క్రియేట్ చేశారు. దీనిపై తెగ చర్చించుకోవడం విశేషం. అయితే సన్ రైజర్స్ హైైదరాబాద్ టీమ్ మొత్తం దేశం విడిచి వెళ్లిపోయింది. మనోళ్లు వెళ్లింది.. కాస్త రిలాక్స్ అవ్వడానికి మాల్దీవులకు వెల్లారు. ఈ సీజన్ లో 9 మ్యాచ్ లు పూర్తి చేసుకున్న సన్ రైజర్స్ మరో 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ ఐదు మ్యాచ్ లు కూడా ఎంతో కీలకమైనవని.. ఆ ఐదు మ్యాచ్ లు గెలిస్తేనే ప్లే ఆప్స్ కి చేరుకుంటుంది. ఆ ఐదు మ్యాచ్ లు అంత కీలకం కాబట్టే.. టీమ్ ను కాస్త కామ్ డౌన్ చేస్తూ ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు టీమ్ ఓనర్ కావ్య మారన్ జట్టు మొత్తాన్ని వెకేషన్ కోసం మాల్దీవులకు పంపించింది.
బీజీ షెడ్యూల్ లో ఆటగాళ్లకు కాస్త చిల్ అవ్వడానికి సమయం ఇస్తే.. వాళ్లు కాస్త ఫ్రెష్ మైండ్ తో మిగిలిన మ్యాచ్ లు ఆడి.. మంచి రిజల్ట్ సాధిస్తారనే కావ్య పాప ప్లాన్. గత ఏడాది అద్భుతంగా ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ లో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్ లో అలా కావద్దని భావించింది. కానీ ఈసారి గత ఏడాది కంటే చెత్త ప్రదర్శన కనబరచడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు కేవలం 3 మ్యాచ్ ల్లోనే విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో మాత్రం 285 భారీ స్కోర్ చేయడంతో అభిమానులు ఈ సారి సన్ రైజర్స్ హైదరాబాద్ దే కప్ అన్నట్టు ఫీల్ అయ్యారు. ఆ తరువాత వరుస ఓటమిలతో వెనుకంజలో పడ్డారు. రేపు గుజరాత్ టైటాన్స్ జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాళ్లు విజృంబిస్తే.. గుజరాత్ టైటాన్స్ కి ఓటమి తప్పదు. మరీ రేపు జరుగబోయే మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తోందో చూడాలి మరీ.