BigTV English

ILT20: టోర్నీ విజేతగా దుబాయి క్యాపిటల్స్

ILT20: టోర్నీ విజేతగా దుబాయి క్యాపిటల్స్

ILT20: అంతర్జాతీయ టి-20 లీగ్ 2025 లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 9 ఆదివారం రోజున దుబాయ్ క్యాపిటల్స్ – డెసర్ట్ వైపర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన డిసెర్ట్ వైపర్స్ జట్టు 189 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మ్యాక్స్ హుల్టెన్ 51 బంతుల్లో 76 పరుగులు, సామ్ కరణ్ 33 బంతులలో 62 పరుగులు, వికెట్ కీపర్ అజాం ఖాన్ 13 బంతులలో 27 పరుగులు చేశారు.


Also Read: Rohit Sharma: రోహిత్ శర్మకు ఒడిశా సీఎం అదిరిపోయే గిఫ్ట్ !

ఇక మిగతా బ్యాటర్లు 10 పరుగులకు మించి రాణించలేదు. దీంతో డెసెర్ట్ వైపర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. దుబాయ్ క్యాపిటల్స్ {Dubai Capitals} బౌలర్లలో ఓబేయ్ మొక్కోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. హైదర్ అలీ, సికందర్ రాజా చెరో వికెట్ పడగొట్టారు. మ్యాక్స్ హోల్టేన్ ఓ విధంగా డెసర్ట్ వైపర్స్ స్కోర్ బోర్డును నిలబెట్టాడు. ఇక అతడు పెవిలియన్ చేరిన అనంతరం శ్యామ్ కరణ్ – అజాం ఖాన్ జోడి చక్కటి భాగస్వామ్యాన్ని అందించారు.


వీరిద్దరూ ఐదవ వికెట్ కి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో డెసెర్ట్ వైపర్స్ జట్టు 189 పరుగుల స్కోర్ చేసింది. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ కాపిటల్స్ {Dubai Capitals} జట్టు.. 19.2 ఓవర్లలోనే ఆరు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వికెట్ కీపర్ షాయ్ హోప్ 39 బంతులలో 43 పరుగులు, రోవ్ మన్ పావెల్ 38 బంతులలో 63, దాసున్ షనకా 10 బంతులలో 21, సికందర్ రాజా 12 బంతులలో 34 పరుగులతో రాణించారు.

ఇక మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఈ క్రమంలో దుబాయ్ క్యాపిటల్స్ {Dubai Capitals} జట్టు 19.2 ఓవర్లలోనే టార్గెట్ ని చేదించింది. ఇక డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో మహమ్మద్ అమీర్, డేవిడ్ పెయిన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కరణ్, నాథన్ సౌటర్ తలో వికెట్ తీశారు. 2023 లో ప్రారంభమైన ఈ టోర్నీ 2023లో ప్రారంభం కాగా.. తొలి సీజన్ లో గల్ఫ్ జెయింట్స్ విజేతగా నిలిచింది.

Also Read: Ind vs Eng 2nd Odi: రెండో వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ..సిరీస్ కైవసం !

ఇక రెండవ సీజన్ లో ఎం.ఐ ఎమిరేట్స్ విజేతగా నిలిచింది. ప్రస్తుతం మూడవ సీజన్ లో దుబాయ్ క్యాపిటల్స్ {Dubai Capitals} టోర్నీ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో దుబాయ్ క్యాపిటల్స్ జట్టు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంది. వీరి సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ టోర్నీలో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ ఫైనల్ కీ చేరేందుకు ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆ జుట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో నాకౌట్ అయ్యింది. ఫిబ్రవరి 7న షార్జా వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎమ్.ఐ ఎమిరేట్స్ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×