BigTV English

Shubman Gill : శుభ్ మన్ గిల్.. తేడా ఎక్కడ కొడుతోంది?

Shubman Gill : శుభ్ మన్ గిల్.. తేడా ఎక్కడ కొడుతోంది?

Shubman Gill : వన్డే వరల్డ్ కప్ 2023లో ఫైనల్ మ్యాచ్ లో మొదలైన ఫెయిల్యూర్ నుంచి ఇంకా శుభ్ మన్ గిల్ కోలుకోలేనట్టుంది. ఆ తర్వాత నుంచి జరుగుతున్న మ్యాచ్ ల్లో అదే రీతిలో పదే పదే అవుట్ అయిపోతున్నాడు. మరి ఫామ్ కోల్పోయాడా? అంటే అదీ లేదని అంటున్నారు. మరెక్కడ తేడా కొడుతోందని అంతా అనుకుంటున్నారు. ఈ విషయంపై భారత్ మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ గిల్ మిస్సవుతున్న టెక్నికల్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.


గిల్ ఫుట్ వర్క్ తో కాకుండా, తన పొడవాటి చేతులతో ఆడేందుకు ఎక్కువ  ఇష్టపడతాడు. ఇది వైట్ బాల్ క్రికెట్ కి అతికినట్టు సరిపోతుంది. అంతేకాదు ఫ్లాట్ పిచ్‌లు, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అనుకూలంగా ఉంటుంది.
కానీ రెడ్ బాల్ తో ఆడే టెస్ట్ మ్యాచ్ లకి సరిపోదు. అందుకే ఇబ్బంది పడుతున్నాడని తేల్చి చెప్పాడు. వైట్ బాల్ ని కొడితే ఫోర్ వెళుతోంది. అదే రెడ్ బాల్ ని అలాగే కొడితే అవుట్ అయిపోతున్నాడని వివరించాడు.

ఈ రెండు బంతుల మధ్య వైవిధ్యాన్ని గిల్ కనిపెట్టి, అందుకు అనుగుణంగా తన ఫుట్ వర్క్ ని మెరుగు పరుచుకుని ఆడగలిగితే తనని మించిన క్రికెటర్ లేడని అన్నాడు. అతనికి ఇంకా చాలా కెరీర్ ఉంది. సుదీర్ఘ క్రికెట్ ఆడే టెస్ట్ మ్యాచ్ లో నిలకడగా ఆడేందుకు ప్రయత్నించాలని సూచించాడు. విదేశీ పిచ్ లు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో మెరుగ్గా రాణించాలంటే సాధన మార్చాల్సి ఉందని అన్నాడు.


అయితే 2023 క్యాలెండర్ ఇయర్ లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు.  45 అంతర్జాతీయ మ్యాచులు ఆడి, 2118 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో చూస్తే మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. పది ఇన్నింగ్సుల్లో కేవలం 258 పరుగులు మాత్రమే చేశాడు. ఇలాగే జరిగితే, రెండో టెస్ట్ తర్వాత టెస్ట్ మ్యాచ్ ల్లో తనకి చోటు ఉండకపోవచ్చునని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×