Varun Aaron – SRH : ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా 2024 లో ఈ టీమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఫైనల్ కి చేరుకుంది. కానీ ఫైనల్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ ని ఢీ కొట్టలేకపోయింది. దీంతో సన్ రైజర్స్ రన్నరప్ గా నిలిచింది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఓనర్ కావ్య పాప కీలక బౌలర్ భువనేశ్వర్ కుమార్ ని వదులుకుంది. దీంతో బెంగళూరు జట్టు భువనేశ్వర్ కుమార్ ని తీసుకుంది. ఆ జట్టు టైటిల్ గెలిచింది. ఇక 2026 ఐపీఎల్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ బిగ్ స్కెచ్ వేయనుంది.
Also Read : PCB Corruption : PCBలో అల్లకల్లోలం.. బోర్డులో కోట్లల్లో అవినీతి.. ఇక పాకిస్తాన్ క్రికెట్ క్లోజ్
బౌలింగ్ లో యానిమల్ లాంటోడు..
టీమిండియా మాజీ బౌలర్ వరుణ్ అరోణ్ ని కోచ్ గా నియమించుకోనుంది. ఇక హైదరాబాద్ ను కాపాడేందుకు బౌలింగ్ లో యానిమన్ లాంటోడు వస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొత్త బౌలింగ్ కోచ్ గా వరుణ్ అరోన్ ని తీసుకొని బౌలింగ్ లో రాటుదేలాలని భావిస్తోంది కావ్య. గత సీజన్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ ని అస్సలు ఎందుకు వదిలేసుకుందో అని అందరూ చర్చించుకుంటున్నారు. భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ లో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. హైదరాబాద్ విజయాల్లో గత ఏడేనిమిది సీజన్లలో కీలక బౌలర్ గా కొనసాగాడు. సన్ రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాంటి బౌలర్ ని వదులుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఒకానొక సమయంలో డేవిడ్ వార్నర్ గాయంతో మ్యాచ్ ఆడని సమయంలో భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలో కూడా విఫలం చెందుతుంది.
కావ్య మారన్ కొత్త వ్యూహాలు..
కేవలం అభిషేక్ శర్మ, క్లాసెన్ వంటి హిట్ బ్యాటర్లు ఆడినప్పుడు మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తుంది. ఈ సీజన్ లో SRH పేలవ ప్రదర్శన కనబరిచింది. కేవలం నాలుగు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్ లన్నింటిలో ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆప్స్ కి చేరుకోలేదు. గత సీజన్ కి ఈ సీజన్ కి తేడా బౌలింగ్ మాత్రమే. బౌలింగ్ లో ఎప్పుడైనా హైదరాబాద్ జట్టు అద్భుతంగా ఉండేది. కానీ ఈ సారి బౌలింగ్ లో కాస్త తడబడిందనే చెప్పాలి. బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బందులు పడ్డారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలో రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2025 ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. వచ్చే సీజన్ లో బౌలింగ్ విభాగాన్ని బలపరిచేందుకు కావ్య మారన్ కొత్త కొత్త వ్యూహాలు రచిస్తోంది. అలాగే ఫారెన్ కి చెందిన ఓ మంచి బౌలర్ ను కూడా వేలంలో తీసుకోవాలని భావిస్తోందట. 2026 సీజన్ కోసం ఇంకా ఏమేమి మార్పులు చేస్తుందో వేచి చూడాలి మరీ.