IFFM: టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కేవలం తెలుగు సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ రాజమౌళి డైరెక్షన్లో బాహుబలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడంతో ప్రభాస్ కు కూడా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ లభించింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక చివరిగా ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Aswin) దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా(Kalki Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్…
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సుమారు 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని ఇటీవల నిర్మాత అశ్వినీ దత్ వెల్లడించారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కల్కి సినిమా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్(IFFM) నామినేషన్స్ లో నిలిచింది. తాజాగా IFFM నామినేషన్ జాబితాను విడుదల చేయగా అందులో కల్కి సినిమా ఉత్తమ చిత్ర విభాగంలో రేసులో నిలిచింది.
ఉత్తమ సినిమా జాబితాలో కల్కి..
ఈ ఉత్తమ సినిమా విభాగంలో..”హోమ్ బౌండ్”,”ఎల్ 2: ఎంపురాన్”, “మహారాజ్”, ” స్త్రీ 2″, “సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్” వంటి తదితర సినిమాలు కూడా నామినేషన్స్ లో నిలిచాయి. ఇలా ఈ సినిమాలకు పోటీగా తెలుగు నుంచి ఉత్తమ చిత్రం నామినేషన్స్ లో కల్కి సినిమా రావటం విశేషం. ఇక ఈ కార్యక్రమం ఆగస్టు 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేల్ బోర్న్ (ఆస్ట్రేలియాలో) ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇక ఈ నామినేషన్ జాబితాలో ప్రభాస్ కల్కి సినిమా నిలవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదిలోనే సీక్వెల్ షూటింగ్…
కల్కి సినిమా ఉత్తమ సినిమాగా తప్పకుండా ఎంపిక అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభించడంతో సీక్వెల్ సినిమా కూడా ఇంతకుమించి ఉండబోతుందని దర్శకుడు ఇటీవల వెల్లడించారు. ఈ సినిమా ఏడాది చివరన షూటింగ్ ప్రారంభమై వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని నిర్మాత అశ్విని దత్ ఇటీవల తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనే నటించిన విషయం తెలిసిందే. ఇక కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించారు. ఇక కల్కి సినిమాలో అమితాబ్ పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్(The Raja Saab), ఫౌజీ పంటి సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్ ఐదో తేదీ ది రాజా సాబ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: Kota – Brahmanandam: బ్రహ్మానందంతో కోట శ్రీనివాసరావు ఎక్కువ సినిమాలు చేయపోవడానికి కారణాలు ఇవేనా?