IPL 2025: చీలమండ గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ {Pat Cummins} ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL 2025} లో ఆడడం అనుమానమేనని గతంలో వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. మొదట శ్రీలంక టూర్ నుండి గ్యాప్ తీసుకున్న కమిన్స్.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమయ్యే సమయంలో స్కాన్ తీయడంతో గాయం ఉన్నట్లు గుర్తించారు. దాంతో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావలసిన పరిస్థితి ఏర్పడింది.
ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ లో కూడా పాల్గొనడం కష్టమేనని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 25 లో 25 వికెట్లు పడగొట్టిన కమిన్స్.. భారత పేస్ బౌలర్ బుమ్రా తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా {Pat Cummins} నిలిచాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం కమిన్స్ గాయంతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా తన రెండవ బిడ్డ పుట్టుకతో శ్రీలంక టూర్ నుండి తప్పుకున్నాడు. అప్పటినుండి కమిన్స్ బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేయలేదు. దీంతో అతడు ఐపీఎల్ {IPL 2025} లో కూడా ఆడే అవకాశాలు తక్కువేనని వార్తలు వినిపించాయి.
దీంతో అతడు కోలుకునేందుకు ఇంకా ఎన్ని రోజులు పడుతుందోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వచ్చే నెల 22 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ లో కమిన్స్ {Pat Cummins} హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్ జట్టు గత సీజన్ లో ఫైనల్ వరకు వెళ్లిందంటే అందుకు ప్రధాన కారణం కమిన్స్. అలాంటి కెప్టెన్ పాట్ కమిన్స్ ఈసారి {IPL 2025} లేకపోతే ఎలా అని ఆరెంజ్ ఆర్మీ బాధలో ఉంది.
ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందింది. అతడు ఐపిఎల్ 2025 బరిలో దిగే అవకాశం ఉందని.. త్వరలోనే కమిన్స్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు ధ్రువీకరించాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కీ ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడాలని కమీన్స్ డిసైడ్ అయినట్లు తెలిపాయి. టి-20లలో ఒక బౌలర్ గరిష్టంగా నాలుగు ఓవర్లు మాత్రమే వేస్తాడు.
ఈ క్రమంలో బౌలర్ శరీరంపై పెద్దగా ప్రభావం పడదని కమిన్స్ {Pat Cummins} భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో కమిన్స్ తిరిగి జట్టులోకి వస్తున్నాడని తెలిసిన హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతడి రాకతో {IPL 2025} సన్రైజర్స్ హైదరాబాద్ మరింత బలంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. ఈ సీజన్ లో కమీన్స్ నాయకత్వంలో హైదరాబాద్ జట్టు కప్ కొట్టడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. 34 ఏళ్ళ కమీన్స్ తన ఐపిఎల్ కెరీర్ లో ఇప్పటివరకు 58 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 63 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్ లో కూడా 515 పరుగులు చేశాడు.