BigTV English

SRH VS RR: బ్యాటింగ్ చేయనున్న SRH… 300 కొట్టడం పక్కా!

SRH VS RR: బ్యాటింగ్ చేయనున్న SRH… 300 కొట్టడం పక్కా!

SRH VS RR:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఆదివారం కావడంతో ఇవాళ రెండు మ్యాచ్లు నిర్వహిస్తోంది ఐపీఎల్ యాజమాన్యం. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన…. రాజస్థాన్ రాయల్స్…. మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు…. మొదట బ్యాటింగ్ చేయబోతుంది. దీంతో హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా ఖుషి గా కనిపిస్తున్నారు.


 

 


సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… మొదట బ్యాటింగ్ చేస్తే కచ్చితంగా 300 కొడుతుందని… అందరూ అంచనా వేస్తున్నారు. గతంలో 287 పరుగుల వరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చేసింది.  ఈసారి కచ్చితంగా 300 పరుగులు చేస్తుందని.. క్రీడా విశ్లేషకులు కూడా చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఇవాళ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయబోతుంది.  ఇక సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ను జియో హాట్ స్టార్ లో మనం వీక్షించవచ్చు. జియో కస్టమర్ లందరికీ… జియో హాట్ స్టార్ లో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచులు… ఉచితంగా అందిస్తున్నారు.

 

SRH VS RR హెడ్ టూ హెడ్

 

సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో… హైదరాబాద్ పై చేయి సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 11 విజయాలు నమోదు చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. అటు రాజస్థాన్ రాయల్స్ ఏకంగా ఎనిమిది మ్యాచ్ లు గెలిచింది. ఇక చివరగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… పై చేయి సాధించింది. చివరగా జరిగిన ఐదు మ్యాచ్ల్లో హైదరాబాద్ విజయాలు నమోదు చేసుకుంది. అదే రాజస్థాన్ మాత్రం రెండు మ్యాచ్లో విజయం సాధించింది.

 

విన్నింగ్ పర్సంటేజ్ ఎవరికి ఎంత ?

 

ఇవాల్టి మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ 60% విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అదే రాజస్థాన్ రాయల్స్ మాత్రం 40 శాతం విజయాన్ని నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో హైదరాబాద్ కచ్చితంగా గెలుస్తుందని.. సన్రైజర్స్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల వివరాలు

 

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (సి), ధ్రువ్ జురెల్ (w), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హక్ ఫరూఖీ

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(సి), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ

 

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×