SRH – Bonalu: తెలంగాణ రాష్ట్రంలో ( Telangana) బోనాల సందడి ( Bonalu) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆషాడం రాకముందే వర్షాకాలం ప్రారంభం అయిన తర్వాత బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం ఒక ఆనవాయితీ. బోనాల పండుగ నిర్వహిస్తేనే వర్షాలు పడతాయని తెలంగాణ ప్రజల నమ్మకం. అందుకే తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల బోనాల పండుగను జూన్ మాసం నుంచి జూలై వరకు కొనసాగిస్తారు. అయితే ఈ బోనాల పండుగ నేపథ్యంలో… హైదరాబాద్ కు సంబంధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులతో కూడిన.. ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బోనాల పండుగ నేపథ్యంలో గల్లీకో యూత్ ఉంటుంది. వాళ్లందరూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. అదే తరహాలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఫ్లెక్సీ ని కూడా ఏర్పాటు చేశారు కొంతమంది. ఇప్పుడు ఇదే ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Rinku Singh : రింకూ సింగ్ ను కుక్కలా తిప్పించుకుంటున్న కాబోయే పెళ్ళాం… రోడ్లపై ఫోటోలు వైరల్
తెలంగాణలో బోనాల సందడి
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బోనాల హడావిడి కొనసాగుతోంది. ముఖ్యంగా బోనాల పండుగ అంటే హైదరాబాద్ అందరికీ గుర్తుకు వస్తుంది. గత నెల రోజులుగా హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ చాలా గ్రాండ్ గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన కాటేరమ్మ కొడుకుల ఫ్లెక్సీ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు హైదరాబాద్ అభిమానులు. ఉప్పల్ ఎక్స్ రోడ్ అడ్డ యూత్ అనే పేరు పెట్టి ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ ని సోషల్ మీడియాలో వైరల్ చేసి… అభిమానులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అంటూ.. అందులో ఒక కావ్య పాప ఫోటోను కూడా పెట్టేశారు. వచ్చే సంవత్సరం కప్పు కొట్టడం గ్యారంటీ అని.. అంతేకాదు 300 కూడా పరుగులు చేస్తామని… సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు. ఇక ఇది చూసిన హైదరాబాద్ అభిమానులు… ఈసారి కప్పు కొట్టడం పక్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాటేరమ్మ కొడుకులు కప్పు కొట్టాల్సిందే అంటూ… పేర్కొంటున్నారు.
ఐపీఎల్ 2025లో దారుణంగా విఫలమైన హైదరాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ( Indian Premier League 2025) అత్యంత దారుణంగా విఫలమైంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ( CSK Team) అలాగే రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేట్ అయిన తర్వాత కింది నుంచి మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు ఆ తర్వాత ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ ( Sun Rishers Hyderabad) జట్టు చాలా బలంగా మ్యాచ్లను గెలుచుకుంటూ ముందుకు వెళ్ళింది. అదే ఐపీఎల్ 2026లో ఎలాగైనా కప్పు కొట్టాలని ఇప్పటినుంచి సన్రైజర్స్ యాజమాన్యం ప్లాన్ చేస్తోంది.
Also Read: Shimron hetmyer : హెట్ మేయర్ అరాచకం..పడుకొని మరి క్యాచ్ పట్టాడు.. ఎక్కడి నుంచి వస్తారో వీళ్లంతా
?igsh=a2ozNG9icG14ZTlt