Telugu Producers : ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ మాటలు జరిగేవి. ఇప్పుడు అదంతా మారిపోయింది. అంత మంది దర్శక నిర్మాతలు పాన్ ఇండియా సినిమా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి కూడా అమాంతం మారిపోయింది. చాలామంది దర్శకులు వాళ్ళ కథలను పాన్ ఇండియా స్థాయిలో చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం కేవలం తెలుగు హీరోలు మాత్రమే సినిమాలు చేయకుండా మిగతా ఇండస్ట్రీ నుంచి వచ్చి కూడా తెలుగులో సినిమాలు చేసే నటులు ఉన్నారు. ఇప్పటికే దుల్కర్ సల్మాన్, ధనుష్ వంటి హీరోలు తెలుగులో మంచి సక్సెస్ అందుకున్నారు. అలానే చాలామంది తెలుగు దర్శకులు తమిళ్ హీరోలతో పనిచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే తమిళ్ దర్శకులు కూడా తెలుగు హీరోల కోసం ఎదురుచూస్తున్నారు.
ముంబైలో ఆఫీస్
శ్రీమంతుడు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్. అయితే ఈ బ్యానర్ అతి తక్కువ కాలంలోనే మంచి సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటిగా నిలబడింది. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ హౌసెస్ గురించి మాట్లాడుకుంటే మైత్రి మూవీ మేకర్స్ గురించి కూడా ఖచ్ఛితంగా మాట్లాడుకోవాలి. చాలామంది స్టార్ హీరోలతో సైతం ఈ సంస్థ సినిమాలు నిర్మించింది. ఇకపోతే స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా చాలామంది అప్కమింగ్ ఫిలిం మేకర్స్ ని యంగ్ డైరెక్టర్స్ ని కూడా ఈ సంస్థ ప్రోత్సహించింది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యానర్ బాలీవుడ్ లో సినిమాలు చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే అక్కడ కూడా ఆఫీసును తీసే ప్లాన్ లో ఉన్నారు.
పుష్ప తో గుర్తింపు
ఈ సంస్థకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమాను కూడా నిర్మించింది ఈ సంస్థ. ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా పేరు సాధించింది. ఇక ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ అంటేనే ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ ను ఇప్పుడు ముంబైలో కూడా తెలిసేలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నిర్మాతలు. కేవలం సినిమాలు నిర్మించడం మాత్రమే కాకుండా మరోవైపు డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాను తెలంగాణలో ఈ సంస్థ విడుదల చేస్తుంది.
Also Read: Allu Arjun New Movies : ముంబైలో అల్లు అర్జున్ ఆఫీస్… ఆ కొరియోగ్రాఫరే క్రియేటివ్ డైరెక్టర్