BigTV English

OTT Movie : మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ ఫిల్మ్… కలలోనూ వెంటాడే భయంకరమైన సీన్స్… ప్యాంట్ తడిపించే మూవీ

OTT Movie : మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ ఫిల్మ్… కలలోనూ వెంటాడే భయంకరమైన సీన్స్… ప్యాంట్ తడిపించే మూవీ

OTT Movie : ఇండోనేషియన్ హారర్ సినిమాలగురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే హారర్ జానర్ లో సరికొత్త స్టోరీలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మేకర్స్. చేతబడులతో, అతీంద్రియ శక్తులతో ఈ సినిమాలను భయంకరంగా తెరకెక్కిస్తున్నారు ఆ దర్శకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇండోనేషియన్ హారర్ సినిమాలో ఒక వ్యక్తి ని చావు అడ్డుకుంటూ ఉంటుంది. ఈ చిత్రం హారర్, కుటుంబ డ్రామాతో ఒక గ్రిప్పింగ్ కథను అందిస్తుంది. ఇది కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, అతీంద్రియ శక్తులతో ప్రేక్షకులను భయపెట్టిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ ఇండోనేషియన్ హారర్ మూవీ పేరు ‘సకరాతుల్ మౌత్’ (Sakaratul maut) 2024 లో వచ్చిన ఈ సినిమాకు సిడ్ సిద్దిక్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇందా పెర్మాతాసరి, డెల్లా దర్త్యాన్, అక్సర దే వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. “సకరాతుల్ మౌత్” అనే శీర్షిక ఇస్లామిక్ సందర్భంలో ‘మరణ బాధ’ అనే అర్థాన్ని సూచిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇది IMDbలో 6.7/10 రేటింగ్‌ ని కూడా కలిగి ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ ఉంబుల్ గ్రామంలో స్థిరపడిన పాక్ విర్యో, బు విర్యో దంపతులతో మొదలవుతుంది. వీళ్ళ జీవితం సంతోషకరంగా సాగుతున్నప్పటికీ, ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం ఈ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టివేస్తుంది. ఈ ప్రమాదంలో బు విర్యో మరణిస్తుంది. పాక్ విర్యో కోమాలోకి వెళ్తాడు. వారి పిల్లలు—రెట్నో, వాటి, పాక్ విర్యో రెండవ భార్యకు పుట్టిన తార్జో తమ తండ్రిని సంరక్షించే బాధ్యతను తీసుకుంటారు. అయితే పాక్ విర్యో ఒక “హోల్డ్” కారణంగా మరణించలేకపోతున్నాడు. ఈ “హోల్డ్” ఒక ఆధ్యాత్మికతకు అడ్డంకిగా ఉంటుంది. ఇది అతనికి మరణం రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఈ సమయంలో కుటుంబంలో ఆస్తి విషయంలో తీవ్రమైన వివాదం తలెత్తుతుంది. పాక్ విర్యో మొదటి భార్య పిల్లలైన రెట్నో, వాటి, రెండవ భార్య కొడుకైన తార్జోతో ఆస్తి విషయంలో గొడవ పడతారు. ఈ వివాదం కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తతలను పెంచుతుంది.

ఈ డ్రామాకు అనుగుణంగా, కుటుంబం ఒక భయంకరమైన ఆత్మ ద్వారా హాంట్ చేయబడుతుంది. ఈ ఆత్మ వారి ఇంటిలో భయంకరమైన సంఘటనలను సృష్టిస్తుంది. రెట్నో, వాటి ఈ ఆత్మ ఎక్కడినుంచి వచ్చిందో కనుగొనడానికి ప్రయత్నిస్తారు. అది వారి తల్లి మరణం, కుటుంబ ఆస్తితో సంబంధం కలిగి ఉండవచ్చని గ్రహిస్తారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ అతీంద్రియ శక్తి నిజమైన స్వభావం బయటపడుతుంది. క్లైమాక్స్‌లో ఈ కుటుంబం తమ గత రహస్యాలను ఎదుర్కొని, ఈ శాపాన్ని అధిగమించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ ఈ శాపం ఏమిటి ? ఈ ఆత్మ ఎవరు ? ఎందుకు వచ్చింది ? ఈ కుటుంబం దీని నుంచి బయటపడుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : పెళ్లి కాకుండగానే ప్రెగ్నెంట్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… మతిపోగోట్టే క్లైమాక్స్

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×