E-Paper
Advertisement

SL vs SA T20 World Cup 2024 Highlights: న్యూయార్క్ పిచ్ పై.. పడుతూ లేస్తూ గెలిచిన సౌతాఫ్రికా

SL vs SA T20 World Cup 2024 Highlights: న్యూయార్క్ పిచ్ పై.. పడుతూ లేస్తూ గెలిచిన సౌతాఫ్రికా

Sri Lanka vs South Africa Highlights T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ చరిత్రలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక చేసిన అత్యల్ప స్కోరు ఇదే. అయినా సరే, సౌతాఫ్రికా పడుతూ లేస్తూ గెలిచింది. న్యూయార్క్ లో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక చేసిన 77 పరుగులు చేయడానికి సౌతాఫ్రికా చెమటలు కక్కింది. 16.2 ఓవర్లు తీసుకుంది. అంటే అక్కడ పిచ్ ఎంత ప్రమాదకరంగా ఉందో…ఈపాటికి అందరికి అర్థమయ్యే ఉంటుంది.

టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ తీసుకుంది. అయితే సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. వీరిలో నలుగురు డకౌట్లు అయ్యారు. ఇలా 19.1 ఓవర్లలో 77 పరుగులకే జట్టు ఆలౌట్ అయ్యింది.

లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా కూడా అపసోపాలు పడింది. ఆ తక్కువ పరుగులు చేయడానికి 16.2 ఓవర్ల తీసుకుంది. ఎట్టకేలకు 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

వివరాల్లోకి వెళితే 78 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాను  శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగు చేసి  వణికించారు. దీంతో వీళ్లు కూడా త్వరగానే చాపచుట్టేస్తారని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఓపెనర్ రీజా హేండ్రిక్స్ (4) త్వరగా అయిపోయాడు.

ఆ తర్వాత మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (20) కెప్టెన్ మార్క్రమ్ (12), ట్రిస్టన్ స్టబ్స్ (13) అందరూ కూడా ఆ కాసిన్ని పరుగులు చేయడానికి అపసోపాలు పడ్డారు. చివరికి గట్టి దెబ్బలు తగిలించుకున్నారు. పిచ్ ముందు పడిపోయారు. పల్టీలు కొట్టారు. బ్యాట్ తో కాళ్లు, ప్యాడ్లను కొట్టీసుకున్నారు. ఈ మధ్యలో రెండు, మూడు లైఫ్ లు తీసుకున్నారు. చివరికి ప్రాణాలకొడ్డి పోరాడినట్టు పోరాడి విజయం సాధించారు.

హెన్రిచ్ క్లాసెన్ (19), డేవిడ్ మిల్లర్ (6) ధైర్యంగా ఆడి జట్టుని విజయతీరాలకు చేర్చారు. అలా 16.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసి టీ 20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికా తొలి విజయాన్ని నమోదు చేసింది.

Also Read: మళ్లీ నోటి దురదను ప్రదర్శించిన పరాగ్.. ఈసారి ఏమన్నాడంటే..?

శ్రీలంక బౌలింగులో తుషార 1, దాసున్ షనక 1, హసరంగ 2 వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాటింగు అత్యంత ఘోరంగా సాగింది. అసలు పరుగులు చేయడం వచ్చా? రాదా? ఇంటర్నేషనల్ ఆటగాళ్లు అయ్యి ఉండి, పిచ్ బాగా లేకపోతే ఆడలేరా? అనే సందేహాలు అందరిలో కనిపించాయి. ఎందుకంటే నలుగురు డక్ అవుట్లు అయ్యారు.

ఇక మ్యాచ్ లో చూస్తే… ఓపెనర్ నిస్సాంక (3), కుశాల్ మెండిస్ (19), కామిందు మెండిస్ (11), హసరంగ (0), సదీర సమరవిక్రమ (0), అసలంక (6), ఏంజిలో మాథ్యూస్ (16), దాసున్ షనక (9), పతిరన (0), తుషార (0) ఇలా  దీపావళి టపాసుల్లా  అయిపోయారు. చివర్లో మహేష్ తీక్షణ (7 నాటౌట్) గా నిలిచాడు. వీరిలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మొత్తానికి శ్రీలంక 19.1 ఓవర్ లో 77 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

సౌతాఫ్రికా బౌలింగులో రబడా 2, అన్రిచ్ నోకియా 4, కేశవ్ మహరాజ్ 2, బార్ట్‌మాన్  1 వికెట్ పడగొట్టారు.

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×