RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 సంవత్సరాలు ఎదురుచూసి 2025 సీజన్ ఫైనల్ లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు జట్టు ఓడించింది. దీంతో తొలి ట్రోఫీని ముద్దాడింది ఆర్సీబీ. పంజాబ్ కింగ్స్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఐపీఎల్ 18వ సీజన్ లో 8వ ఛాంపియన్ గా నిలిచింది ఆర్సీబీ. జూన్ 03న జరిగిన ఈ మ్యాచ్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పేది అనుకుంటున్నారా..? ఏం లేదంటే..? ఆ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది. అయితే ఆ జట్టులోని ఆటగాళ్ల అందరి పేర్లను ఓ ఆర్సీబీ అభిమాని టాటూ వేయించుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 190 పరుగులు చేసింది. అయితే 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు తరపున టీమిండియా క్రికెటర్ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు. జితేష్ శర్మ బ్యాటింగ్ చేసి 240 స్ట్రైక్ రేట్ తో 10 బంతుల్లో 24 పరుగులు చేసాడు. కృణాల్ పాండ్యా 17 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ కూడా 2 కీలక వికెట్లు తీశాడు. పంజాబ్ తరపున అర్ష్ దీప్ సింగ్, కైల్ జామిసన్ 3, 3 వికెట్లు పడగొట్టారు. ఐపీఎల్ చరిత్రలో ట్రోఫీ సాధించిన 8వ జట్టుగా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.
ఐపీఎల్ హిస్టరీలో ట్రోఫీ సాధించిన 8వ జట్టుగా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. రాజస్థాన్ రాయల్స్ (1), చెన్నై సూపర్ సూపర్ కింగ్స్ (5), ముంబై ఇండియన్స్ (5), కోల్ కతా నైట్ రైడర్స్ (3), డెక్కన్ ఛార్జర్స్ (1), సన్ రైజర్స్ హైదరాబాద్ 1, గుజరాత్ టైటాన్స్ (1) సారి ఛాంపియన్స్ గా నిలిచాయి. దీంతో అత్యధికంగా ముంబై, చెన్నై జట్లు 5 సార్లు టైటిల్స్ గెలిస్తే.. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ జెయింట్స్ నిలిచాయి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించక పోవడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్ లో పలు కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మారనున్నట్టు.. చెన్నై నుంచి రుతురాజ్ గైక్వాడ్ ఆర్సీబీకి.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడుక్లాసెన్ చెన్నైకి ఇలా చాలా మంది ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరో జట్టుకి మారనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొంత మందనే ఆయా జట్లు రిటైన్ చేసుకోనున్నట్టు సమాచారం. కొంత మంది కొత్త ఆటగాళ్లు కూడా వేలంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.