BigTV English

Rohit Sharma – MS Dhoni: ధోని, రోహిత్ లకు బంపర్ ఆఫర్.. మళ్లీ వాళ్లకే కెప్టెన్సీ!

Rohit Sharma – MS Dhoni: ధోని, రోహిత్ లకు బంపర్ ఆఫర్.. మళ్లీ వాళ్లకే కెప్టెన్సీ!

Rohit Sharma – MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 18వ ఎడిషన్ చాలా ఆసక్తిగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 23 మ్యాచ్ లు పూర్తయ్యాయి. దీంతో ఇప్పుడు ప్రతి మ్యాచ్ కూడా ప్లే ఆఫ్స్ ని దృష్టిలో పెట్టుకొని జట్లు ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆప్స్ కి చేరడానికి జరిగే ఈ సమరం మరింత ఉత్కంఠగా మారనుంది. అయితే ఈ ఐపీఎల్ లో ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈసారి ప్లే ఆఫ్స్ చేరేందుకు చెమటలు చిందించాల్సిందే.


 

ఐదుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు.. అలాగే గత ఐపీఎల్ రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ మూడు జట్లు చివరి స్థానాలలో పోటీ పడుతున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన ఈ మూడు జట్లు.. రెండేసి పాయింట్లతో, పాయింట్ల పట్టికలో ఆఖరి మూడు స్థానాలు తీసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోరు చేయలేకపోతోంది.


కానీ బౌలింగ్ లో పరవాలేదు అనిపిస్తుంది. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమవుతుంది. ఒక్కరు కూడా నిలకడగా భారీ ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్నారు. ఈ సీజన్ లో చెన్నై గెలిచిన ఒకే ఒక మ్యాచ్ ముంబై ఇండియన్స్ మీదే. ఆ మ్యాచ్ లో కూడా ముంబై నిర్దేశించిన 156 పరుగులను ఛేదించడానికి 19.1 ఓవర్లు ఆడింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విఫలం కావడం, భారీ స్కోర్లుగా మలచడంలో బ్యాటర్లు విఫలం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయ అవకాశాలు దెబ్బతింటున్నాయి.

ఇక ముంబై ఇండియన్స్ కూడా ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, లతోపాటు రికెల్టన్, విల్ జాక్స్, నమన్ ధీర్ లాంటి భారీ హిట్టర్స్ ఉన్న ఈ జట్టు.. ఇప్పటివరకు ఒక మ్యాచ్ లోనే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నప్పటికీ.. భాగస్వామ్యాలు నిర్మించడంలో విఫలం అవుతున్నారు. ఒక హార్దిక్ పాండ్యా మాత్రమే బౌలింగ్, బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఉంది.

ఇక స్టార్ బౌలర్ బుమ్రా గత మ్యాచ్ లోనే జట్టులో చేరాడు. మొదటి మ్యాచ్ లో వికెట్లు తీయలేకపోయినప్పటికీ.. కాస్త పరుగులను నియంత్రించాడు. ఈ రెండు జట్లు ఐపిఎల్ లో ఇలాగే కొనసాగితే.. లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టడం ఖాయం. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను ధోనీకి, ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ కి అప్పగించబోతున్నారంటూ ఓ వర్త వైరల్ గా మారింది. వీరికి మళ్ళీ జట్టు పగ్గాలు అప్పగిస్తేనే.. మళ్లీ ఈ జట్లు గెలుపు బాట పడతాయని ఈ ఫ్రాంచైజీలు అంచనా వేస్తున్నాయట. ఈ వార్త తెలిసిన రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోని అభిమానులు కూడా ఈ నిర్ణయం సరైనదేనని కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

Related News

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Big Stories

×